ఆ వార్తలు కొట్టివేయలేం, ఎగిరే పళ్లాలున్న మాట నిజమే, ధృవీకరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా , రీసెర్చ్ జరుగుతోందని వెల్లడి
ఎగిరే పళ్లాలు (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్) ఉన్న మాట నిజమేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇటీవల వర్జీనియా కోస్ట్ లో రెండేళ్లుగా రోజూ తాము వీటిని చూసేవారమని అమెరికా నేవీ సిబ్బంది చెప్పిన మాటలు వాస్తవమేనని
ఎగిరే పళ్లాలు (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్) ఉన్న మాట నిజమేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇటీవల వర్జీనియా కోస్ట్ లో రెండేళ్లుగా రోజూ తాము వీటిని చూసేవారమని అమెరికా నేవీ సిబ్బంది చెప్పిన మాటలు వాస్తవమేనని, వీటిని మనం సీరియస్ గా తీసుకోవాలని, సులువుగా కొట్టివేయలేమని ఆయన చెప్పారు. ఇవి ఎలా వేగంగా కదిలివెళ్తాయో, వాటి ట్రాజెక్టరీ ఏమిటో ఇప్పటికిప్పుడు చెప్పలేమని, ఇంకా రీసెర్చ్ జరుగుతోందని అన్నారు. అమెరికా లేట్ లేట్ టీవీ షో కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. 2008 లో తాను దేశాధ్యక్షపదవిని చేపట్టాక వీటి రహస్యాలఫై ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకోదలిచానని అన్నారు. ఇందుకు ఆసక్తి చూపానన్నారు. అలాగే ఏలియన్ స్పెసిమెన్స్, వాటి స్పేస్ షిప్స్ శాంపిల్స్ ని ల్యాబ్ లో ఎక్కడ ఉంచారో కనుగొనాలని కూడా ఇంట్రెస్ట్ చూపానని ఆయన తెలిపారు. అమెరికా మిలిటరీ టార్గెట్లను ఎగిరే పళ్ళాలు మాటిమాటికీ వేధిస్తున్న దృశ్యం తాలూకు ఫుటేజీని నేను చూశానని, ఇది ఈ మధ్యే వైరల్ అయిందని ఆయన చెప్పారు. కానీ ఇవి ఖచ్చితంగా ఏమిటన్నవి ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఇప్పటికీ వీటిపై పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఒబామా చెప్పారు.
2019 జులైలో శాన్ డీగో సమీపాన నీటిలోకి దూసుకువస్తున్న యూఎఫ్ఓను అమెరికా నిఘా నౌక గుర్తించింది. గతవారం ఈ వీడియోను పెంటగాన్ రిలీజ్ చేసింది. 2015-17 మధ్యకాలంలోకూడా వర్జీనియా కోస్టులో ఓ మాజీ నేవీ అధికారి ర్యాన్ గ్రేవ్స్ తన సహచరులు వీటిని చూసేవారని, కానీ వాటి ఆరాను తెలుసుకోలేకపోయారని చెప్పారు. లీకయిన కొత్త ఫుటేజీని మళ్ళీ పెంటగాన్ విడుదల చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: MP Cleans Dirty Toilet Video Viral : కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన ఎంపీ..! చివరికి ఏమన్నాడో తెలుసా..!