MP Cleans Dirty Toilet Video Viral : కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన ఎంపీ..! చివరికి ఏమన్నాడో తెలుసా..!
Mp Janardan Mishra: ఎంపీ జనార్ధన్ మిశ్రా క్వారంటైన్‌లోని టాయిలెట్ శుభ్రంచేశారు. ఆయన తన చేతులతో ఈ పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మాటలు చెప్పే నాయకులను మాత్రమే మనం చాలాసార్లు చూస్తుంటాం. కానీ ఇందుకు భిన్నంగా ఓ నాయకుడు కోవిడ్ సెంటర్‌ను సందర్శించడమే కాదు… స్వయంగా ఆయనే అక్కడి టాయిలేట్లను శుభ్రం చేశారు. అంతే కనీసం తాను చేసిన పనిని చూసైన నలుగు ఫాలో అవుతారని అంటున్నాడు. ఈ పని చేసింది ఓ మామూలు నాయకుడు కాదు పార్లమెంట్ సభ్యులు(MP) మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా క్వారంటైన్‌లోని టాయిలెట్ శుభ్రంచేశారు. ఆయన తన చేతులతో ఈ పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్వయంగా ఎంపీ ఇలాంటి పని చేయడం చూసిన అధికారులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంపీ జనార్ధన్ మిశ్రా క్వారంటైన్ సెంటర్‌ను తనిఖీ చేసి… అక్కడి కోవిడ్ బాధితులను పరమార్శించి తిరిగి వెళ్తుండగా ఆయన టాయిలెట్ చాలా మురికిగా ఉండటాన్ని గమనించారు. వెంటనే దానిని శుభ్రం చేసే పనిలో పడ్డారు.
ఎంపీ ఒక్కరే ఈ పనిని చేశారు. చేతులకు గ్లౌజులు ధరించి టాయిలెట్‌ను పరిశుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… తాను ఇటువంటి పని చేయడంద్వారా చాలామంది ఇటువంటి పనులు చేసేందుకు ముందుకు వస్తారని తెలిపారు. ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదని అన్నారు. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలి అంటూ చెప్పు కొచ్చారు.
जब जन प्रतिनिधि काम करवाने के बजाय स्वयं काम करने लग जायें तो आप क्या कहेंगे, ये रीवा के सांसद जनार्दन मिश्रा जी है क्वरेन्टीन सेंटर के टॉयलेट की सफाई करते इनका वीडियो वायरल। @ABPNews pic.twitter.com/xLHHCQqZwc
— Brajesh Rajput (@brajeshabpnews) May 18, 2021