మా దేశంలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ లేదు, భారత మీడియాలో వచ్చిన వార్తలు నిజం కావు, సింగపూర్ ప్రభుత్వం స్పష్టీకరణ

తమ దేశంలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నూతన స్ట్రెయిన్ కారణంగా థర్డ్ కోవిడ్ ముప్పు రాబోతోందన్న వార్తల నేపథ్యంలో మా దేశంలో ఈ విధమైన స్ట్రెయిన్ లేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మా దేశంలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ లేదు, భారత మీడియాలో వచ్చిన వార్తలు నిజం కావు, సింగపూర్ ప్రభుత్వం స్పష్టీకరణ
Truth In Claims Of New Covi
Follow us

| Edited By: Phani CH

Updated on: May 19, 2021 | 10:52 AM

తమ దేశంలో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నూతన స్ట్రెయిన్ కారణంగా థర్డ్ కోవిడ్ ముప్పు రాబోతోందన్న వార్తల నేపథ్యంలో మా దేశంలో ఈ విధమైన స్ట్రెయిన్ లేదని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత మీడియాలో వచ్చిన వార్తలు నిజం కావని వివరించింది.సింగపూర్ స్ట్రెయిన్ వల్ల పిల్లలకు ముప్పు కలిగే అవకాశం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి వారాల్లో బీ.1.617.2 వేరియంట్ పుట్టుకొచ్చిందని, ఫైలోజెనిటిక్ టెస్ట్ చేయగా ఇది తమ దేశంలో పలు క్లస్టర్లతో కూడుకుని ఉందని ఈ శాఖ స్పష్టం చేసింది. కాగా సింగపూర్ విద్యార్థుల్లో ఈ కోవిడ్ లక్షణాలు కనబడడంతో స్కూళ్ళు, జూనియర్ కాలేజీలను ఈ నెల 28 వరకు మూసివేశారు. 12 నుంచి 15 ఏళ్ళ మధ్యవయస్సు వారికి వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది.

సింగపూర్ నుంచి వచ్చే విమానాలను వెంటనే రద్దు చేయాలని, అలాగే ఇండియా నుంచి ఆ దేశానికి వెళ్లే విమాన సర్వీసులను కూడా తక్షణమే క్యాన్సిల్ చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నిన్న కేంద్రాన్ని కోరారు. సింగపూర్ వేరియంట్ వల్ల ముఖ్యంగా మూడో కోవిద్ వేవ్ తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో కోవిద్ కేసులు ఓ వైపు తగ్గినప్పటికీ.. సింగపూర్ వేరియంట్ ప్రమాదకరమైందని వార్తలు వస్తున్నాయని ఆయన చెప్పారు. అటు-థర్డ్ కోవిద్ వేవ్ కి సిద్ధపడి ఉండాలని కేంద్రానికి ముఖ్య శాస్త్రీయ సలహాదారైన కె.విజయరాఘవన్ హెచ్చరించారు. ఇప్పటికే మూడో కోవిద్ వేవ్ పై కేంద్రం కూడా వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి:  డ్యాన్స్ అంటే అమితమైన ఇష్టంతో ఇంట్లోనే పోల్ డాన్స్… అంతలోనే సడన్ షాక్… ( వీడియో )

Tamil Nadu: పెళ్లి చేసుకున్న మరుక్షణం..ఆ రెండు జంటలూ చేసిన పని తెలిస్తే.. అభినందించకుండా ఉండలేరు!