Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: పెళ్లి చేసుకున్న మరుక్షణం..ఆ రెండు జంటలూ చేసిన పని తెలిస్తే.. అభినందించకుండా ఉండలేరు!

Tamil Nadu: కరోనా మహామ్మరితో పోరాటానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తీసుకుంటున్నారు. తమకు చేతనైన సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

Tamil Nadu: పెళ్లి చేసుకున్న మరుక్షణం..ఆ రెండు జంటలూ చేసిన పని తెలిస్తే.. అభినందించకుండా ఉండలేరు!
Tamil Nadu
Follow us
KVD Varma

|

Updated on: May 19, 2021 | 10:53 AM

Tamil Nadu: కరోనా మహామ్మరితో పోరాటానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తీసుకుంటున్నారు. తమకు చేతనైన సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. పెద్ద పెద్ద సహాయాల దగ్గర నుంచి చిన్న చిన్న సహాయాల వరకూ ఎవరికి అవకాశం ఉన్నంతలో వారు ఈ మహమ్మారి సమయంలో తోటివారిని ఆదుకోవడానికి చేస్తూ వస్తున్నారు. వారు చేసే సహాయం విలువ కన్నా వారిలో కనబడే మానవత్వ విలువలు చాలా ఎక్కువ. అటువంటి సహాయమే తమిళనాడులో కొందరు అందించారు. నాగాపట్నంలో సోమవారం ఉదయం ఎస్ షరీన్ రాజ్, వి. సూర్యల వివాహం జరిగింది. వారు అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ చర్చిలో ఉంగరాలు మార్చుకుని తమ వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు.

వెంటనే అక్కడ నుంచి నేరుగా అవే పెళ్లి దుస్తులలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కలెక్టర్ ప్రవీణ్ పీ నాయర్ ను కలిశారు. ముఖ్యమంత్రి కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కోసం 50 వేల రూపాయల చెక్ అందించారు. ఈ సంసర్భంగా వరుడు శరీన్ రాజ్ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రపంచ సంక్షోభ సమయంలో మేము వివాహం చేసుకున్నాము. మా పెళ్లి విందులు వంటి వాటికి చేసే ఖర్చును కరోనా రోగుల ఉపశమనం కోసం ఇవ్వాలని అనుకున్నాము. అందుకే ముఖ్యమంత్రి కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కు పెళ్లి జరిగిన వెంటనే, మేము చెక్ అందించాము అని చెప్పారు. తిరుతురైపూండి నుండి గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన 25 ఏళ్ల వధువు వి సూర్య మాట్లాడుతూ“ మా కుటుంబాలు రెండూ విద్యా ప్రాంతంలో పనిచేస్తాయి. నా భర్త , నేను కలిసి ఈ కొద్దిపాటి సహాయం చేయాలని అనుకున్నాము.” అని చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ పి నాయర్ దంపతులు విరాళం ఇచ్చినందుకు ప్రశంసించారు. “దాతల యొక్క సుముఖత మరియు దాతృత్వం వారు విరాళంగా ఇచ్చే నగదు కంటే ఎక్కువ.” అని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

ఇక మరో సంఘటనలో చెన్నైకి 188 కిలోమీటర్ల దూరంలో, విల్లుపురంలోని మనంపూండి అనే చిన్న పట్టణంలో, కొత్తగా వివాహం చేసుకున్న మరో జంట కూడా అదేవిధంగా చేసింది. దండలు మార్పిడి చేసుకుని పెళ్లి తంతు పూర్తి అయిన తరువాత వారు తిరుకోవిలూర్ లోని ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పోన్ముడి ని అయన నివాసంలో కలిశారు. ఆయనకు 51,000 రూపాయల నగదును అందచేశారు. వివాహ వస్త్రాలతోనే ఆయన వద్దకు వెళ్ళిన ఈ నవదంపతులు ముఖ్యమంత్రి కోవిడ్ 19 సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇచ్చారు. ఈ విషయంపై వరుడు హరిభాస్కర్ మాట్లాడుతూ “మేము ఒక గొప్ప వివాహానికి ప్లాన్ చేసాము, కాని లాక్డౌన్ కారణంగా, మేము దానిని సాధారణ వ్యవహారంగా జరుపుకోవాల్సి వచ్చింది. మా గొప్ప పెళ్లి కోసం మేము ఆదా చేసిన డబ్బులో కొంత భాగాన్ని ముఖ్యమంత్రి కోవిడ్ ఫండ్‌కు ఇచ్చాము. మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇవ్వడంలో ఇది మా కనీస బాధ్యత అనుకున్నాము అని చెప్పారు.

వీరిచ్చిన విరాళాలు చిన్న మొత్తాలుగా కనిపించవచ్చు. కానీ, వీరిచ్చిన స్ఫూర్తి అభినందనీయం. వారి మానవతా విలువలకు అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు.

Also Read: Corona for Lions: కరోనా బారిన పడిన సింహాలు..పరిస్థితి విషమం..సెలైన్ల ద్వారా ఆహారం!

Another System: అప్పుడే మించిపోలేదు.. ముంచేందుకు మరో తుఫాన్ రెడీ.. IMD మరో హెచ్చరిక..