Corona for Lions: కరోనా బారిన పడిన సింహాలు..పరిస్థితి విషమం..సెలైన్ల ద్వారా ఆహారం!

Corona for Lions: కరోనా కష్టాలు మనుషులకే కాదు..జూలో ఉన్న జంతువులకూ వచ్చాయి. ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో సింహాలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వార్తలు వచ్చాయి.

Corona for Lions: కరోనా బారిన పడిన సింహాలు..పరిస్థితి విషమం..సెలైన్ల ద్వారా ఆహారం!
Corona for lion
Follow us
KVD Varma

|

Updated on: May 19, 2021 | 8:32 AM

Corona for Lions: కరోనా కష్టాలు మనుషులకే కాదు..జూలో ఉన్న జంతువులకూ వచ్చాయి. ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో సింహాలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వార్తలు వచ్చాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ లోని రెండు సింహాలు కూడా ఉన్నాయి. వీటి పేర్లు గౌరీ, జెన్నీఫర్. వీటి పరిస్థితి బాగా విషమించింది. ఈ రెండూ కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచీ వీటికి ప్రత్యేకంగా వైద్యం అందిస్తూ వస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాటి పరిస్థితి విషమించిందని చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటావాకు చెందిన లయన్ సఫారిలో ఈ సింహాలు ఉన్నాయి. కరోనా సోకినప్పటి నుండి ఈ రెండు సింహాలూ ఆహారం తీసుకోవడం లేదు. దీంతో వీటికి సెలైన్ ద్వారా లిక్విడ్ రూపంలో ఆహారం అందిస్తున్నారు. అదేవిధంగా కోవిడ్ చికిత్స కూడా చేస్తున్నారు. ఆహారం లేకపోవడంతో సింహాలు క్రమేపీ నీరసించి పోతున్నాయి.

గుజరాత్, హైదరాబాద్, ఢిల్లీ, డెహ్రాడూన్ సహా యూపీలోని పలు సంస్థల స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ఆన్‌లైన్, వీడియో కాలింగ్ సహాయంతో ఈ సింహాలకు చికిత్స అందిస్తున్నట్లు సఫారి డైరెక్టర్ కృష్ణ కుమార్ సింగ్ తెలిపారు. కానీ, ఇంకా వీటికి కరోనా నుంచి ఉపశమనం లభించలేదన్నారు. ఆహారం తినకపోవడం వల్ల ఈ సింహాల ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని ఆయన చెబుతున్నారు.

ఈ సింహాలకు సూప్ అలాగే గ్లూకోజ్ ఇస్తున్నారు. రెండూ ఎక్కువ కాలం ఘన ఆహారం తీసుకోలేదు. సఫారీలోని ఈ సింహాలు ఏప్రిల్ 30నుంచి ఆహారం తీసుకోవడం మానేశాయి. దీంతో సఫారి నిర్వాహకులు అక్కడ ఉన్న18 సింహాలకు కోవిడ్ పరీక్ష నిర్వహించింది. ఈ సింహాలలో గౌరీ, జెన్నిఫర్ కరోనా పాజిటివ్ గా తేలాయి. మిగిలిన సింహాలకు కరోనా నెగెటివ్ గా రిపోర్టు వచ్చింది.

సఫారీలో ఉన్న మిగిలిన 16 సింహాలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాయి. ఇవి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కృష్ణ కుమార్ సింగ్ చెప్పారు. వీటితో పాటు, ఇతర సఫారీ జంతువులైన రైన్ డీర్, ఎలుగుబంటి, చిరుతపులిలో కోవిడ్ సంక్రమణకు సంబంధించిన ఫిర్యాదులు ఏవీ లేవని ఆయన తెలిపారు. కోవిడ్ బారిన పడిన రెండు సింహాలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు ఇతర జంతువులను సంక్రమణ నుండి రక్షించడం సఫారి నిర్వహణ ముందు ముందు ఒక పెద్ద సవాలు గా మారింది. దీని కోసం సఫారి నిర్వహణాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Also Read: ముంబైలో 953 కోవిడ్ కేసుల నమోదు, మొదటిసారిగా అతి తక్కువన్న ప్రభుత్వం, ఊపిరి పీల్చుకున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్

మాకు భారత ప్రజలే ముఖ్యం, వారిని కాదని వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చేయలేదు, సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా స్పష్టీకరణ

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్