AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‎ ఖాన్‌కు భారీ ఊరట.. శిక్షను రద్దుచేసిన ఇస్లామాబాద్ కోర్టు.. కానీ జైలులోనే..

Imran Khan: తోషాఖానా అవినీతి కేసులో శిక్షపడి జైలు శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు ఉపశమనం లభించింది. ట్రయల్‌ కోర్టు విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్ట్‌ నిలిపివేసింది. తనకు పడిన శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్ట్‌ విచారణ పూర్తి చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి..

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‎ ఖాన్‌కు భారీ ఊరట.. శిక్షను రద్దుచేసిన ఇస్లామాబాద్ కోర్టు.. కానీ జైలులోనే..
Imran Khan
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 29, 2023 | 9:20 PM

Share

Imran Khan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. ట్రయల్‌ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్ట్‌ నిలిపివేయడంతో ఆయనపై ఎన్నికల అనర్హత వేటు తప్పింది. తోషాఖానా అవినీతి కేసులో శిక్షపడి జైలు శిక్ష అనుభవిస్తోన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు ఉపశమనం లభించింది. ట్రయల్‌ కోర్టు విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను ఇస్లామాబాద్‌ హైకోర్ట్‌ నిలిపివేసింది. తనకు పడిన శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్ట్‌ విచారణ పూర్తి చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమిర్‌ ఫారూఖ్‌, జస్టిస్‌ తారీఖ్‌ మహ్మద్‌ జహంగిరిలతో కూడిన ధర్మాసనం తీర్పును ప్రకటించింది.

2018 నుంచి 2022 వరకూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన బహుమతులను ‘తోషాఖానా’ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే ఆరోపణలు ఇమ్రాన్‌ ఖాన్‌పై ఉన్నాయి. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ నెల 5న ట్రయల్‌ కోర్ట్‌ ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేసింది. ఈ నెల 5న కోర్టు తీర్పు రాగానే ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జిల్లా జైలుకు తరలించారు. శిక్ష అనుభవిస్తూనే ఇమ్రాన్‌ ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేశారు. విచారణ జరిపిన ఇస్లామాబాద్ హైకోర్టు ట్రయల్‌ కోర్టు తీర్పును నిలిపివేసింది.

ఇవి కూడా చదవండి

పీటీఐ స్పందన..

ఇమ్రాన్ విడుదల..

అందరిలో ఒక్కరు..

అయితే తాజాగా ఇమ్రాన్‌ఖాన్‌పై పోలీసులు నమోదు చేసిన సైఫర్‌ కేసులో ఇమ్రాన్‌ జైలులోనే గడపాల్సి ఉంది. రహస్య చట్టాలను దుర్వినియోగం చేశారని ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఇమ్రాన్ పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకున్నారని అందులో పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ప్రధానిని.. బుధవారం కోర్టులో హాజరు పరచనున్నారు.  మరోవైపు తన భర్తకు జైలులో ప్రాణ భయం ఉందని ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ ఇటీవల పంజాబ్ హోం కార్యదర్శికి లేఖ రాశారు. అటాక్ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించాలని ఆమె కోర్టు అధికారులను కోరారు. అయితే అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..