AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: సైడ్ ఎఫ్పెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వారంలో ఓ సారైనా వీటిని తినాల్సిందే..

Weight Loss Tips: అధిక బరువు అనేది శారీరక ఆరోగ్యానికే కాక చాలా మందిలో అత్మవిశ్వాసానికి కూడా అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే కొందరు బరువు తగ్గేందుకు ఎన్నో రకాల ట్రీట్‌మెంట్స్ వాడుతుంటారు, కానీ సరైన ఫలితాలు లేక సర్దుకుపోతుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడ వల్ల తేలికగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంకా వాటిని తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవని, పైగా శరీర ఆరోగ్యం కావాలసిన ఎన్నో పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి ఏయే ఆహారాలను తప్పనిసరిగా..

Weight Loss Tips: సైడ్ ఎఫ్పెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే వారంలో ఓ సారైనా వీటిని తినాల్సిందే..
Weight Lose Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 28, 2023 | 4:01 PM

Share

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు కారణంగా వచ్చే ఊభకాయం మరో పెద్ద సమస్య. ఈ సమస్యలు శారీరక ఆరోగ్యానికే కాక చాలా మందిలో అత్మవిశ్వాసానికి కూడా అడ్డంకిగా మారింది. ఈ క్రమంలోనే కొందరు బరువు తగ్గేందుకు ఎన్నో రకాల ట్రీట్‌మెంట్స్ వాడుతుంటారు, కానీ సరైన ఫలితాలు లేక సర్దుకుపోతుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడ వల్ల తేలికగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంకా వాటిని తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవని, పైగా శరీర ఆరోగ్యం కావాలసిన ఎన్నో పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి ఏయే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

పాల ఉత్పత్తులు: బరువు తగ్గాలనుకునేవారికి పాల ఉత్పత్తులు మంచి ఆహార ఎంపిక. అన్ని రకాల పాల ఉత్పత్తులలో కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇవి బరువు తగ్గడంలో మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. పాలు, పెరుగు నచ్చనివారు మజ్జిగ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఫలితంగా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

కూరగాయలు: కూరగాయల్లో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాదాపు అన్ని రకాల ఆకు కూరలు, కూరగాయల్లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ పనితీరు పెరిగి, బరువు తగ్గుతారు. ఇంకా వీటి ద్వారా లభించే మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఇవి కూడా చదవండి

బీన్స్: అన్ని రకాల చిక్కుళ్లు ప్రోటీన్‌, ఫైబర్, మినరల్స్, విటమిన్లను కలిగి ఉంటాయి. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఫలితంగా రక్తంలోని కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండెకు మేలు జరుగుతుంది. ఇంకా బరువు తగ్గుతారు.

పుట్టగొడుగులు: పుట్టగొడుగుల్లో కొవ్వు ఉండదు. పైగా వీటిల్లో శరీరానికి అవసరమైన పొటాషియం, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు మీ శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

వెల్లుల్లి: వంటగదిలోని అన్ని రకాల మసాలాలు మన ఆరోగ్యం కూడా చేర్చినవే. వీటిల్లో వెల్లుల్లి ప్రముఖమైనది. దీనిలోని యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే వెల్లుల్లిలోని ఫైబర్ బరువు తగ్గడంలో, శరీరంలోని కొలెస్ట్రాల్ని తొలగించడంలో ఉపయోగపడుతుంది.

చిలగడ దుంపలు: చిలగడ దుంపలు లేదా స్వీట్ పోటాటో ద్వారా శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ లభిస్తుంది. ప్రోటీన్ శక్తి కోసం అవసరం కాగా, ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి బరువు తగ్గేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా ఇందులోని విటమిన్ సి, బి, ఎ.. పొటాషియం, మాంగనీస్, జింక్ శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి.

గమనిక: పై సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి