Health Tips: మీరు ఫూల్ మఖానా తినట్లేదా..? అయితే ఈ 8 ప్రయోజనాలను మిస్ చేసుకున్నట్లే..

Health Tips: సమృద్ధికర పోషకాలను అందించే ఆహారాల్లో ఫూల్ మఖానా కూడా ఒకటి. ప్రోటీన్, ఫైబర్, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్‌తో విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ప్రయోజనకరమైన విటమిన్లు కూడా మఖానాల్లో ఉన్నాయి. ఈ కారణంగా మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి మఖానాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో..

Health Tips: మీరు ఫూల్ మఖానా తినట్లేదా..? అయితే ఈ 8 ప్రయోజనాలను మిస్ చేసుకున్నట్లే..
Makhanas' Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 28, 2023 | 4:31 PM

Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కోసం సమయానికి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. అందులో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడడం కూడా అంతే ఆవశ్యకం. అలాంటి పోషకాలను అందించే ఆహారాలు, మూలాలు మన ప్రకృతిలో అడుగడుగునా ఉన్నాయి. అలాంటి ఆహారాల్లో ఫూల్ మఖానా కూడా ఒకటి. ప్రోటీన్, ఫైబర్, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్‌తో విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ప్రయోజనకరమైన విటమిన్లు కూడా మఖానాల్లో ఉన్నాయి. ఈ కారణంగా మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి మఖానాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మెరిసే చర్మం: ఫూల్ మఖానాలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉన్నందున వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా చేయగలవు. అలాగే విటమిన్ ఇ ముఖం యవ్వనంగా కనబడేలా చేయడంతో పాలు మొటిమలు, మచ్చలను తొలిగంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

2.జీర్ణవ్యవస్థ: ఫూల్ మఖానాలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు పెరిగి, జీవక్రియలు సకాలంలో జరుగుతాయి. అలాగే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. గుండె ఆరోగ్యం: మఖానాల్లో అల్కలాయిడ్స్, సపోనిన్లు, గల్లిక్ యాసిడ్స్‌తో పాటు మెగ్నిషియం ఉండాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచడంతో పాటు రక్త ప్రసరణను పెంచుతాయి. ఫలితంగా గుండెపోటు వంటి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

4. కిడ్నీల ఆరోగ్యం: యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున మఖానాలు కీడ్నీల్లోని ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా వాపు, రాళ్లు ఏర్పడకుండా కిడ్నీలను కాపాడతాయి.

5. డయాబెటీస్: రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో కూడా మఖానాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా మఖానాల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అయినందున వీటినీ డయాబెటిక్ పేషెంట్లు నిరభ్యంరంగా తీసుకోవచ్చు.

6. సంతాన ప్రాప్తి: సంతాన సమస్యలు ఉన్నవారు వారంలో ఓ సారి అయినా మఖానాలను తింటే స్పెర్మ్ సెల్స్‌ నాణ్యత పెరుగుతుంది. ఇంకా లైగింక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచి సంతానలేమి నుంచి బయటపడేస్తాయి.

7. రక్తహీనత: మఖానాల్లో ఐరన్ ఉన్నందున ఇది శరీరంలో రక్తహీనత సమస్యను దూరం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ కారణంగా గర్భధారణ, పీరియడ్స్‌ సమయంలో మహిళలకు ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

8. ఉక్కు లాంటి ఎముకలు: ఎముకలను బలోపేతం చేయడంలో కాల్షియం, ఫాస్పరస్ మెరుగ్గా పనిచేస్తాయి. ఈ రెండు పోషకాలు మఖానాలో అధిక మొత్తంలో ఉన్నందున ఇవి మీ ఎముకులను బలేపేతం చేయగలవు.

గమనిక: పై సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి