Anand Mahindra: ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌.. అందరూ తమ పిల్లలను ఇలాగే ప్రోత్సహించాలంటూ..

Anand Mahindra: చెస్ మెగాటోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద అద్భుతమైన ఆట తీరును మహీంద్రా & మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా మెచ్చుకుంటూ ఈ నెల 24న ట్వీట్ చేశారు. అయితే ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా తన ప్రశంసలను అంతటితో ఆపేయలేదు. 18 ఏళ్ల వయసుకే చెస్ వరల్డ్‌కప్ ఆడి ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పిన ప్రజ్ఞానందకు అద్దిరిపోయే బహుమతి ఇచ్చాడు. నిజం చెప్పుకోవాలంటే ఆ బహుమతి ప్రజ్ఞానందకు కాదు, అలాంటి యువ తేజాన్ని దేశానికి

Anand Mahindra: ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌.. అందరూ తమ పిల్లలను ఇలాగే ప్రోత్సహించాలంటూ..
Praggnanandhaa's Mother; Anand Mahindra
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 28, 2023 | 5:38 PM

Anand Mahindra: చెస్ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌ ఫైనల్‌లో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ గెలవగా.. భారత్‌కు చెందిన రమేష్‌బాబు ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చెస్ మెగాటోర్నీలో ప్రజ్ఞానంద రన్నరస్‌గా నిలిచినప్పటికీ దేశవ్యాప్తంగా అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మహీంద్రా & మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ప్రజ్ఞానంద అద్భుతమైన ఆట తీరును మెచ్చుకుంటూ ఈ నెల 24న ట్వీట్ చేశారు. అయితే ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా తన ప్రశంసలను అంతటితో ఆపేయలేదు. 18 ఏళ్ల వయసుకే చెస్ వరల్డ్‌కప్ ఆడి ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పిన ప్రజ్ఞానందకు అద్దిరిపోయే బహుమతి ఇచ్చాడు. నిజం చెప్పుకోవాలంటే ఆ బహుమతి ప్రజ్ఞానందకు కాదు, అలాంటి యువ తేజాన్ని దేశానికి అందించిన అతని తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా ఇచ్చారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటంటే.. Mahindra XUV400 EV.

అవును, ఆర్థిక పరిస్థితులను సవాల్ చేస్తూ తమ కొడుకుకు 10 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్, 12 ఏళ్లకు గ్రాండ్‌మాస్టర్ అయ్యేలా ప్రోత్సహించిన నాగలక్ష్మి-రమేష్ బాబు దంపతులకు ఆనంద్ మహీంద్ర ఎలక్ట్రీక్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా కూడా మారింది.

ఇవి కూడా చదవండి

‘మీరు మా కృతజ్ఞతకు అర్హులు..’

అయితే ఈ నెల 25న ఆంటే ఆదివారం ప్రజ్ఞానంద తన తల్లి నాగలక్ష్మితో ఉన్న ఫోటోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసి ‘అమ్మా, నీకు వందనాలు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన క్రిష్లే అనే ఓ నెటిజన్ ‘అతను మహీంద్రా థార్ పొందేందుకు అర్హుడు’ అంటూ కామెంట్ చేశాడు. దీన్ని గమనించిన మహీంద్రా ప్రజ్ఞానందకు కాకుండా, అతని తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కార్ ఇవ్వాలనుకుంటున్నట్లుగా రిప్లై ఇచ్చాడు. నెటిజన్ క్రిష్లే కామెంట్‌పై ఆనంద్ మహీంద్రా ‘క్రిష్లే, ప్రజ్ఞానందకు థార్ బహుమతిగా ఇవ్వమని నాకు సలహా ఇచ్చిన మీ ఆలోచన బాగుంది. కానీ నాకు మరో ఆలోచన ఉంది. తమ పిల్లలకు చెస్ వంటి ఆటల్లోకి పంపేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. ప్రజ్ఞానందకు చెస్ ఆట ఆడడంలో మద్ధతుగా నిలిచిన అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి-రమేష్ బాబు దంపతులకు XUV400 EV ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు మా కృతజ్ఞతకు అర్హులు’ అంటూ పేర్కొన్నారు.

కాగా, ఆగస్టు 24న జరిగిన చెస్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద అసాధారణ నైపుణ్యం, ఏకాగ్రత ప్రదర్శించాడు. అయితే ఆ మ్యాచ్‌లో అతను రన్నరప్‌గా నిలిచి రజతంలో సరిపెట్టుకున్నాడు. దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ప్రజ్ఞానందను ప్రశంసిస్తూ ‘‘ప్రజ్ఞానంద నువ్వు రన్నరప్‌. ఇది తర్వాత వచ్చే స్వర్ణం కోసం ‘రన్ అప్’ మిమ్మల్ని గొప్ప ఆటగాడిగా మారుస్తుంది. ఇంకో రోజు బతకడం కోసం పోరాడాల్సి వస్తే ఎన్నో పోరాటాలు నేర్చుకోవాలి. మీరు పోరాడడం నేర్చుకున్న వెంటనే, మరొక పోరాటం సాధ్యమే. అందుకే మేము మళ్లీ మళ్లీ మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటాము’ అని ఆనంద్ మహీంద్రా ట్విట్‌లో రాశారు.

మీరు ‘రన్ అప్’

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..