16 ఏళ్లకే జవాన్.. రాత్రిపూట ప్రాక్టీస్.. కట్‌చేస్తే.. 3 స్వర్ణాలతో హిట్లర్‌కే మెంటల్ ఎక్కించిన భారత హాకీ మాంత్రికుడు..

Major Dhyan Chand Birth Anniversary: మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినమైన ఆగస్టు 29ని భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తుంటారు. అదే సమయంలో, క్రీడా రంగంలో అతని పేరు మీద ఒక అవార్డు కూడా ఇస్తున్నారు. దీనిని 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు' అని పిలుస్తుంటారు. గతంలో ఈ ఖేల్ రత్నను 'రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు' అని పిలిచేవారు.

16 ఏళ్లకే జవాన్.. రాత్రిపూట ప్రాక్టీస్.. కట్‌చేస్తే.. 3 స్వర్ణాలతో హిట్లర్‌కే మెంటల్ ఎక్కించిన భారత హాకీ మాంత్రికుడు..
Major Dhyan Chand
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2023 | 12:15 PM

National Sports Day 2023: భారత లెజెండ్, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ఆగష్టు 29, 1905న ప్రయాగ్‌రాజ్ (పూర్వపు అలహాబాద్)లో జన్మించారు. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినమైన ఆగస్టు 29ని భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తుంటారు. అదే సమయంలో, క్రీడా రంగంలో అతని పేరు మీద ఒక అవార్డు కూడా ఇస్తున్నారు. దీనిని ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు’ అని పిలుస్తుంటారు. గతంలో ఈ ఖేల్ రత్నను ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు’ అని పిలిచేవారు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు బంగారు పతకాలు సాధించిన ఆటగాడిగా ధ్యాన్‌చంద్ సరికొత్త చరిత్ర లికించారు. భారత క్రీడలకు ధ్యాన్ చంద్ ఎంతో కృషి చేశారు. అయితే ఆయన హాకీ ఆడడం ఎలా మొదలైందో తెలుసా? గోల్స్ కొట్టే అద్భుతమైన కళకు ప్రసిద్ధి చెందిన ధ్యాన్‌చంద్ హాకీ నైపుణ్యం సైన్యంతో ప్రారంభమైందంట.

ధ్యాన్‌చంద్ 16 ఏళ్ల వయసులో భారత సైన్యంలో సైనికుడిగా చేరాడు. అక్కడే హాకీ ఆడడం కూడా ప్రారంభించాడు. ధ్యాన్ సింగ్ చంద్రుని కాంతిలో అంటే రాత్రిపూట హాకీ ప్రాక్టీస్ చేసేవాడు. అలా ఆయన పేరు ‘చంద్’గా మారిపోయింది. అలా ద్యాన్ సింగ్ నుంచి ద్యాన్ చంద్ గా మారిపోయారు. ధ్యాన్‌చంద్ 1922 నుంచి 1926 వరకు సైన్యానికి చెందిన తురు నుంచి రెజిమెంటల్ మ్యాచ్‌లు ఆడుతూ అందరినీ ఆకర్షించాడు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రదర్శన తర్వాత, ధ్యాన్‌చంద్ న్యూజిలాండ్ పర్యటన కోసం ఆర్మీ జట్టులో ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలో జట్టు చాలా మంచి ప్రదర్శన కనిపించింది. భారత ఆర్మీ జట్టు 18 మ్యాచ్‌లు గెలిచింది. 2 డ్రాలు, ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. ఈ పర్యటన తర్వాత ధ్యాన్‌చంద్‌కు మరింత గుర్తింపు వచ్చింది. ఇలా మెల్లగా అతని ప్రయాణం ముందుకు సాగడం మొదలైంది.

హిట్లర్‌కే పిచ్చేక్కించిన ధ్యాన్‌చంద్..

1936 ఒలింపిక్స్‌లో హాకీ ఫైనల్‌లో భారత్ 8-1తో జర్మనీని ఓడించింది. జర్మనీ ఈ ఓటమిని హిట్లర్ సహించలేక స్టేడియం వదిలి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో ధ్యాన్‌చంద్ ఒక్కడే మూడు గోల్స్ చేశాడు. ధ్యాన్‌చంద్ అద్భుత ప్రదర్శనను చూసిన హిట్లర్ మ్యాచ్ ముగిసిన తర్వాత అతడిని హాకీ కాకుండా ఏం చేస్తారు అని అడిగాడు. ధ్యాన్‌చంద్ మాట్లాడుతూ, నేను భారతీయ సైనికుడిని అంటూ బదులిచ్చారు. ఈ క్రమంలో హిట్లర్ అతనికి జర్మన్ సైన్యంలో చేరమని ప్రతిపాదించాడు. దానిని ధ్యాన్‌చంద్ తిరస్కరించాడు.

ఒలింపిక్స్‌లో 3సార్లు స్వర్ణం..

1928, 1932, 1936లో మేజర్ ధ్యాన్‌చంద్ భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడారు. అందులో భారత్ మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..