ఇరాన్ ! నిన్ను వదలం ! ట్రంప్ వార్నింగ్ !

బాగ్దాద్ లోని తమ దేశ ఎంబసీపై ఇరాన్ అనుకూల నిరసనకారులు చేసిన దాడిపై భగ్గుమంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇక ఇరాన్ భూభాగంలోకి తాము వందలాది ట్రూపులను పంపుతామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 29 న ఇరాన్ కు చెందిన కతాబ్ -ఎ -హిజ్బుల్లా అనే గ్రూపు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో రెండు డజన్ల మంది మరణించారు. దీంతో ప్రతీకారంగా ప్రో-ఇరాన్ మిలీషియా […]

ఇరాన్ ! నిన్ను వదలం ! ట్రంప్ వార్నింగ్ !
Follow us

|

Updated on: Jan 01, 2020 | 5:49 PM

బాగ్దాద్ లోని తమ దేశ ఎంబసీపై ఇరాన్ అనుకూల నిరసనకారులు చేసిన దాడిపై భగ్గుమంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇక ఇరాన్ భూభాగంలోకి తాము వందలాది ట్రూపులను పంపుతామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 29 న ఇరాన్ కు చెందిన కతాబ్ -ఎ -హిజ్బుల్లా అనే గ్రూపు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో రెండు డజన్ల మంది మరణించారు. దీంతో ప్రతీకారంగా ప్రో-ఇరాన్ మిలీషియా సభ్యులు బాగ్దాద్ లోని హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ చెక్ పాయింట్లను ఛేదించుకుని అమెరికన్ ఎంబసీపై దాడికి పాల్పడ్డారు.

ఇరాక్ నుంచి అమెరికన్ దళాలను ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. ఇరాన్ లో రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధినేత ఖాసిం సోలిమనికి విధేయులమని చెప్పుకుంటున్న ఆందోళనకారులు అమెరికాకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఎంబసీ కాంపౌండ్ కి నిప్పుపెట్టారు. ఇలా ఉండగా.. అబూ-మహాది-అల్ ముహందీస్ అనే కరడు గట్టిన ఉగ్రవాది ఒక వ్యూహం ప్రకారం టెర్రరిస్టులను ఈ దాడికి ప్రేరేపిస్తున్నాడని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. కాగా -తాము రానున్న రోజుల్లో ఇరాన్ కు 750 సైనిక ట్రూపులను తరలించనున్నట్టు రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ప్రకటించారు. ఇలా ఉండగా.. బాగ్దాద్ లో రెండో రోజు కూడా ఇరాన్ అనుకూల ఆందోళనకారులు అమెరికన్ ఎంబసీలోకి చొచ్ఛుకుపోవడానికి ప్రయత్నించారు. ఈ కార్యాలయంలోని ఏ ఒక్క ఉద్యోగినీ వదలబోమని వీరిలో ఒకడు కేక పెట్టాడు. అటు-అమెరికా.. తమ హెలికాఫ్టర్లలో మరింతమంది సైనికులను ఈ స్పాట్ వద్దకు పంపుతోంది.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్