5 జీ ట్రయల్స్.. చైనా సంస్థకు భారత్ అనుమతి

చైనాతో భారత్ చెలిమికి కొత్త సంవత్సరం మంచి నాంది పలికినట్టు కనిపిస్తోంది. ఇండియాలో 5 జీ ట్రయల్స్ లో తన వంతు సేవలందించేందుకు చైనా సంస్థ.. ‘ హువే ‘ టెక్నాలజీస్ ను అనుమతించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు చైనా హర్షం వ్యక్తం చేసింది. 5 జీ నెట్ వర్క్ ల ట్రయల్స్ నిర్వహణకు అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు వాయు తరంగాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ […]

5 జీ ట్రయల్స్.. చైనా సంస్థకు భారత్ అనుమతి
Follow us
Pardhasaradhi Peri

| Edited By:

Updated on: Jan 01, 2020 | 3:57 PM

చైనాతో భారత్ చెలిమికి కొత్త సంవత్సరం మంచి నాంది పలికినట్టు కనిపిస్తోంది. ఇండియాలో 5 జీ ట్రయల్స్ లో తన వంతు సేవలందించేందుకు చైనా సంస్థ.. ‘ హువే ‘ టెక్నాలజీస్ ను అనుమతించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు చైనా హర్షం వ్యక్తం చేసింది. 5 జీ నెట్ వర్క్ ల ట్రయల్స్ నిర్వహణకు అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు వాయు తరంగాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

ఇండియాలో ఈ ట్రయల్స్ కోసం హువే సంస్థను అనుమతించరాదని అమెరికా ప్రభుత్వం భారత్ ను కోరినప్పటికీ.. ఈ సూపర్ ఫాస్ట్ నెట్ వర్క్ ‘ ఫ్రక్రియ లో పార్టిసిపేట్ చేసేందుకు ముందుకు వచ్ఛే ఏ సంస్థనయినా అడ్డుకోరాదని సర్కార్ భావనగా కనబడుతోంది. కాగా- సెక్యూరిటీ కారణాల దృష్ట్యా.. తమ మార్కెట్లో హువే ఉత్పత్తుల ప్రవేశాన్ని ట్రంప్ ప్రభుత్వం లోగడ నిషేధించింది. ముఖ్యంగా తమ దేశంలో నిఘా.. గూఢచర్య కార్యకలాపాలకు హువే సంస్థను చైనా వినియోగించుకుంటోందని అమెరికా అనుమానిస్తోంది. అలాగే చైనాలోని అమెరికా కంపెనీలను చెనీస్ టెక్నాలజీ కంపెనీల సేవలను ఉపయోగించుకోరాదని కూడా సూచించింది.