గ్రీన్ కార్డు బిల్లుకు యుఎస్ ఆమోదం.. భారత్ హర్షం

అమెరికాలో శాశ్వత నివాసానికి, జాబ్ చేసుకునేందుకు వలసదారులకు వీలు కల్పించే గ్రీన్ కార్డు బిల్లును అమెరికా కాంగ్రెస్ బుధవారం ఆమోదించింది. ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇవ్వరాదన్న నిబంధనలు.. ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ఇబ్బందులు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోటా పరిమితిని ఎత్తివేయాలని కోరుతూ సెనేట్ లో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ 7 శాతాన్ని 15 శాతానికి పెంచేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. […]

గ్రీన్ కార్డు బిల్లుకు యుఎస్ ఆమోదం.. భారత్ హర్షం
Follow us

|

Updated on: Jul 11, 2019 | 1:17 PM

అమెరికాలో శాశ్వత నివాసానికి, జాబ్ చేసుకునేందుకు వలసదారులకు వీలు కల్పించే గ్రీన్ కార్డు బిల్లును అమెరికా కాంగ్రెస్ బుధవారం ఆమోదించింది. ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇవ్వరాదన్న నిబంధనలు.. ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ఇబ్బందులు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోటా పరిమితిని ఎత్తివేయాలని కోరుతూ సెనేట్ లో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ 7 శాతాన్ని 15 శాతానికి పెంచేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు, తక్కువ ఉన్న దేశాలకు ఒకే రకమైన రూల్స్ అమలవుతుండడంతో.. ప్రధానంగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్ కు చెందిన వలసదారుల దరఖాస్తులు కుప్పలు..తెప్పలుగా పేరుకుపోయాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు గత ఫిబ్రవరిలో.. ‘ ఫెయిర్ నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రంట్ యాక్ట్ ‘ (హెచ్ ఆర్ 1044) పేరిట బిల్లును భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారిస్, తన సహచరుడు మైక్ లీ తో కలిసి సెనేట్ లో ప్రవేశపెట్టారు. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఈ బిల్లును 365 మంది సమర్థించగా.. 65 మంది వ్యతిరేకించారు. అటు-112 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో ఇదే తరహా బిల్లును జో లాఫెన్, కెన్ బక్ ప్రతిపాదించారు. గూగుల్, వాల్ మార్ట్ వంటి సంస్థలు కూడా ఈ బిల్లుకు సుముఖత వ్యక్తం చేశాయి. ఈబీ వీసాల కింద యుఎస్ ఏటా 1.4 లక్షలమందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తోంది. హెచ్-1బీ వీసాలతో అమెరికాకు వఛ్చి గ్రీన్ కార్డు కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఆమోదం వల్ల ఎంతో ప్రయోజనం కలగనుంది. పైగా ఎక్కువకాలం వేచి ఉండే అవసరం కూడా ఉండదు. ప్రస్తుత విధానం ప్రకారం.. భారతీయుల అప్లికేషన్లన్నీ ఆమోదానికి నోచుకోవాలంటే సుమారు 70 ఏళ్ళు పడుతుందని అంచనా. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల్లో పరిమిత కోటాను ఎత్తివేయడంతోబాటు ఫ్యామిలీ స్పాన్సర్డ్ విభాగంలో 15 శాతానికి పెంచేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అమెరికాలోని సంస్థలు ప్రధానంగా హెచ్-1బీ వీసాల ద్వారానే విదేశీ నిపుణులను నియమించుకుంటున్నాయి.

జాన్ కర్టిస్ అనే సభ్యుడు ఈ బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. దీనివల్ల ఫస్ట్ కమ్-ఫస్ట్ సర్వ్డ్ సిస్టం అనే విధానం అమల్లోకి వస్తుందని, ఫలితంగా అమెరికన్ కంపెనీలు గ్లోబల్ ఎకానమీలో అత్యంత నిపుణులైనవారిని జాబ్స్ లోకి తీసుకోవడానికి వీలవుతుందని అన్నారు. వారు ఎక్కడ పుట్టినా.. ఏ దేశానికి చెందిన వారైనా సరే..అన్నారు. బిల్లును చట్ట రూపంలోకి తీసుకువచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ వెంటనే దీనిపై దృష్టి పెట్టాలని జో-లాఫ్ గ్రెన్ అనే మరో సభ్యుడు పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, వాషింగ్టన్ లోని సీటెల్ ఏరియా, న్యూయార్క్ లోని ట్రై స్టేట్ ఏరియా, న్యూజెర్సీ, కనెక్టికట్ వంటి ప్రాంతాలవారంతా ఈ బిల్లు పట్ల హర్షం వ్యక్తం చేశారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ పూర్తి సంతృప్తిని ప్రకటించింది.