బ్రిటన్‌ నౌకపై ఇరాన్ దాడి!

హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడికి దిగిందని ఆమెరికా గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌ను కూడా ఇరాన్ తన ఆధినంలోకి తెచ్చకునేందుకు ప్రయత్నించినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ ప్రచురించింది. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్ బ్రిటీష్ హెరిటేజ్.. హార్ముజ్ జల సంధి గుండా ప్రయాణిస్తుండగా..ఇరాన్‌ నావికా దళానికి చెందిన నౌకలు అడ్డగించాయి. ఇరాన్‌వైపు వెళ్లాలంటూ హెచ్చరించాయి. అయితే..సదరు ఆయిల్ ట్యాంకర్‌కు రక్షణగా వస్తున్న బ్రిటన్ […]

బ్రిటన్‌ నౌకపై ఇరాన్ దాడి!
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 9:12 PM

హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడికి దిగిందని ఆమెరికా గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌ను కూడా ఇరాన్ తన ఆధినంలోకి తెచ్చకునేందుకు ప్రయత్నించినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ ప్రచురించింది. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్ బ్రిటీష్ హెరిటేజ్.. హార్ముజ్ జల సంధి గుండా ప్రయాణిస్తుండగా..ఇరాన్‌ నావికా దళానికి చెందిన నౌకలు అడ్డగించాయి. ఇరాన్‌వైపు వెళ్లాలంటూ హెచ్చరించాయి. అయితే..సదరు ఆయిల్ ట్యాంకర్‌కు రక్షణగా వస్తున్న బ్రిటన్ ఫ్రిగేట్లను(యుధ్ధ నౌకలు) చూసి అవి తోకముడిచాయి. అక్కడి పరిస్థితులు గమనిస్తున్న అమెరికా యుధ్ద విమానం..ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డు చేసినట్టు కూడా సదరు పత్రిక ప్రచురించింది.