తాలిబన్ల భయం.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖాళీ అవుతున్న భారతీయ కుటుంబాలు, అధికారులు
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోంది. దీంతో ఆ దేశం నుంచి భారతీయ కుటుంబాలను, అధికారులను ఇండియా ఖాళీ చేయిస్తోంది. కాబూల్, కాందహార్, మజారే షరీఫ్, తదితర తమ స్టాఫ్ ను, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించే యత్నాలు ప్రారంభించామని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోంది. దీంతో ఆ దేశం నుంచి భారతీయ కుటుంబాలను, అధికారులను ఇండియా ఖాళీ చేయిస్తోంది. కాబూల్, కాందహార్, మజారే షరీఫ్, తదితర తమ స్టాఫ్ ను, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించే యత్నాలు ప్రారంభించామని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. భారతీయ ఎంబసీలు, దౌత్య కార్యాలయాలు కూడా పని చేయడం కష్టమవుతోందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. తాలిబన్ల దాడుల భయంతో ఆఫ్ఘన్ అధికారులు కూడా మూటా ముల్లె సర్దుకుంటున్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి తమ సైనికదళాలను పూర్తిగా ఉపసంహరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇదివరకే ప్రకటించారు. దీంతో తాలిబన్లకు అడ్డే లేకపోయింది. తమ కార్యకలాపాలను వారు అనేక ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించారు. ఇప్పటికే ఆఫ్ఘన్ లో పలు జిల్లాలను తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. కొన్ని చోట్ల ఆఫ్ఘన్ భద్రతా దళాలు కూడా వీరితో చేతులు కలపడం విశేషం. నిన్న 300 మందికి పైగా ఆఫ్ఘన్ సైనికులు తజికిస్తాన్ ను దాటి వెళ్లారు.
కాబూల్ లో ఎంబసీ సహా ఆఫ్ఘన్ లో ఇండియాకు నాలుగు దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలలో స్టాఫ్ అంతా తిరిగి ఇండియాకు వస్తారో లేదా కొంతమంది అక్కడే ఉంటారో తెలియడంలేదు. జలాలాబాద్, హైరత్ వంటి సిటీల్లో దౌత్య కార్యాలయాలు కొన్ని రోజులుగా పని చేయడం లేదు. కాబూల్ నుంచి విదేశీ దళాలు పూర్తిగా వైదొలగాలని తాలిబన్లు కోరుతున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.
Rare Snake Video: వైజాగ్ శేషాచలం అడవుల్లో బంగారు రంగు వర్ణంలో త్రాచు పాము…వైరల్ అవుతున్న వీడియో.