Tallest Horse: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆ గుర్రం ఇక లేదు.. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న.
Tallest Horse: ప్రపంచంలోనే అత్యంత పొడవైన గుర్రంగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన గుర్రం ఇటీవల మరణించింది. పాయినెట్ ప్రాంతంలోని స్మోకీ హాల్లౌ ఫామ్‌లో ఉంటోన్న జేక్ అనే గుర్రం అనారోగ్యం కారణంగా మరణించినట్లు ఫామ్ యజమానులురాలు..
Tallest Horse: ప్రపంచంలోనే అత్యంత పొడవైన గుర్రంగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన గుర్రం ఇటీవల మరణించింది. అమెరికాలోని విస్కాన్సిన్ పాయినెట్ ప్రాంతంలోని స్మోకీ హాల్లౌ ఫామ్‌లో ఉంటోన్న జేక్ అనే గుర్రం అనారోగ్యం కారణంగా మరణించినట్లు ఫామ్ యజమానులురాలు జెర్రీ గ్లిబెర్ట్ మీడియాకు తెలిపారు. అయితే ఈ గుర్రం రెండు వారాల క్రితమే మరణించినప్పటికీ దాని యజమానులు మాత్రం సరైన తేదీని మాత్రం చెప్పడానికి అంగీకరించలేదు. దీనికి కారణం జేక్ లేదు అనే విషయాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోకపోవడమే. ఈ గుర్రం ఎప్పుడు చనిపోయిందో చెప్పకపోవడానికి కారణాన్ని తెలుపుతూ.. ‘జేక్ మమ్మల్ని వదిలిపోయిన రోజును గుర్తుంచుకోవాలనుకోవట్లేదు. జేక్ లేని లోటు మా కుటుంబానికి తీవ్ర బాధకరమైన ఘటన’ అని చెప్పుకొచ్చారు.
ఈ గుర్రానికి ఉన్న అంత ప్రాముఖ్యత ఏంటనేగా మీ సందేహం. ఆరు అడుగులకు పైగా ఎత్తు ఉన్న ఈ గుర్రం ప్రపంచంలోనే అత్యంత పొడవైన గుర్రంగా 2020లో గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. బెల్జియం జాతికి చెందిన ఈ గుర్రం బరువు ఏకంగా 1,136 కిలోలు ఉండడం మరో విశేషం. ఈ గుర్రం జన్మించినప్పుడే 109 కిలోల బరువుతో జన్మించింది. సాధారణంగా బెల్జియంకు చెందిన గుర్రాలు జన్మించిన సమయంలో కేవలం 45 కిలోలు మాత్రమే ఉండడం గమనార్హం. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ గుర్రం మరణించిదన్న వార్త ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.
Also Read: Lockdown: మళ్లీ విరుచుకుపడిన కరోనా రక్కసి.. ఆ రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్
Boy Missing: అడవిలో తప్పిపోయిన బాలుడు.. 8వ రోజూ దొరకని ఆచూకీ.. డాగ్ స్క్వాడ్ సైతం..