AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

On this day in Cricket: కొత్త బౌలర్ దెబ్బకు టీమిండియా మటాష్; 137 పరుగులకే 10 వికెట్లు.. మాయని మచ్చలా ఆసియా కప్‌ ఫైనల్

టీమిండియా చరిత్రలో జులై 6 మాయని మచ్చలా మిగిలింది. కారణం, ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు కొత్త స్పిన్నర్ దెబ్బకు పిట్టల్లా రాలిపోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

On this day in Cricket: కొత్త బౌలర్ దెబ్బకు టీమిండియా మటాష్; 137 పరుగులకే 10 వికెట్లు.. మాయని మచ్చలా ఆసియా కప్‌ ఫైనల్
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Jul 06, 2021 | 3:38 PM

Share

On this day in Cricket: టీమిండియా చరిత్రలో జులై 6 మాయని మచ్చలా మిగిలింది. కారణం, ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు కొత్త స్పిన్నర్ దెబ్బకు పిట్టల్లా రాలిపోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో సహా ప్రసిద్ధ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. అది కూడా అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ అనుభవం లేని ఓ బౌలర్ ముందు పేకమేడలా కూలిపోయారు. 2008 జులై 6న కరాచీలో జరిగిన ఆసియా కప్ ఫైనల్ భారత జట్టు కేవలం ఎనిమిది ఓవర్లలో 13 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది.

భారత్, శ్రీలంక జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరాయి. ఇందులో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండీస్ హీరోగా మారిపోయి భారత్ పతనాన్ని శాసించాడు. శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసి, 49.5 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ సనత్ జయసూర్య 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 114 బంతుల్లో 125 పరుగులు చేశాడు. ఆయనతో పాటు తిల్లకరత్నే దిల్షాన్ 74 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి. మూడవ బెస్ట్ స్కోరర్‌గా నువాన్ కులశేఖర 29 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత జట్టు తరపున ఆర్‌పీ సింగ్, ఇషాంత్ శర్మ తలో మూడు వికెట్లు పడగొట్టారు. ఇర్ఫాన్ పఠాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. వీరేందర్ సెహ్వాగ్ కూడా వేట చేశాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు సెహ్వాగ్ మెరుపులాంటి ఆరంభాన్ని అందించాడు. కానీ, మరో ఎండ్ లో వికెట్లు పేకమేడలా కూలిపోతున్నాయి. గౌతమ్ గంభీర్ తో కలిసి సెహ్వాగ్‌ ఓపెనింగ్ బరిలోకి నిలిచారు. 6 పరుగులు చేసిన అనంతరం గంభీర్ పెవిలియన్ చేరాడు. ఇక రెండో వికెట్ గా సెహ్వాగ్ పెవిలియన్ చేరాడు. కానీ, ఉన్నంత సేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 9.2 ఓవర్లలో 76 పరుగుల వద్ద డాషింగ్ ఓపెనర్ పెవిలియన్ చేరాడు. అయితే సెహ్వాగ్ స్కోర్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఈ స్కోర్ లో 60 పరుగులు కేవలం సెహ్వాగ్ చేసినవే కావడం విశేషం. సెహ్వాగ్ 36 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో 60 పరుగులు చేశాడు. టీమిండియా టాప్ ఆర్డర్ లోని ఆరుగురు బ్యాట్స్ మెన్స్ లో నలుగురు అజంతా మెండీస్ కే బలికావడం గమనార్హం. సురేష్ రైనా, యువరాజ్ సింగ్ కూడా వెంటనే పెవిలియన్ చేరారు. ఇదే సమయంలో రోహిత్ శర్మను కూడా ఎల్‌బీడబ్ల్యూ తో వెనుకకు పంపారు శ్రీలంక బౌలర్లు. మెండిస్ ..ఆర్‌పీ సింగ్‌, ఇర్ఫాన్ పఠాన్‌ను కూడా పెవిలియన్ చేర్చి భారత్ ను దారుణంగా దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్ లో అంజతా మెండీసీ కేవలం 8 ఓవర్లలో కేవలం 13 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా మహేంద్ర సింగ్ ధోనీ 74 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మొత్తానికి టీమిండియా 137 పరుగులకు ఆలౌట్ అయ్యి పరాజయం పాలైంది.

Also Read: 

అయ్యో నేను షూస్ మర్చిపోయాను..?షూ లేకుండా కోర్టులోకి ఎంటరైన ఆస్ట్రేలియా ప్లేయర్..:Nick Kyrgios forget shoe video.

On this day in Cricket: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన హిట్‌మ్యాన్; ఇంగ్లండ్ గడ్డపై ఆ రికార్డుతో చరిత్ర సృష్టించాడు..!