UN Security Council: మరోసారి అసలు రంగు బయటపెట్టిన డ్రాగన్.. పాక్ ఉగ్రవాదికి అండగా నిలిచిన చైనా

యుఎన్‌ఎస్‌సిలో భారత్-అమెరికా లిస్టింగ్ ప్రతిపాదనను రెండు నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది రెండోసారి. జైషే మహ్మద్ డిప్యూటీ చీఫ్ రవూఫ్ అస్గర్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి టెర్రరిస్టు జాబితాలో చేర్చాలన్న భారత్-అమెరికా సంయుక్త ప్రయత్నాన్ని చైనా గురువారం అడ్డుపడింది.

UN Security Council: మరోసారి అసలు రంగు బయటపెట్టిన డ్రాగన్.. పాక్ ఉగ్రవాదికి అండగా నిలిచిన చైనా
China
Follow us

|

Updated on: Aug 12, 2022 | 1:20 PM

JeM deputy chief Asghar: డ్రాగన్ కంట్రీ మరోసారి వక్రబుద్ధిని బయటపెట్టింది. ఉగ్రవాద నిర్మూలనకు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌, అమెరికా (India – US) చేస్తోన్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడింది. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు అబ్దుల్ రౌఫ్‌ అజార్‌ (Abdul Rauf Azhar) పై ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్‌ చేసిన ప్రతిపాదన చేశాయి. దీనిని చైనా అడ్డుకొని ఉగ్రవాదంపై మరోసారి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. యుఎన్‌ఎస్‌సిలో భారత్-అమెరికా లిస్టింగ్ ప్రతిపాదనను రెండు నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది రెండోసారి. జైషే మహ్మద్ డిప్యూటీ చీఫ్ రవూఫ్ అస్గర్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి టెర్రరిస్టు జాబితాలో చేర్చాలన్న భారత్-అమెరికా సంయుక్త ప్రయత్నాన్ని చైనా గురువారం అడ్డుపడింది. అబ్దుల్ రౌఫ్‌ అజార్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం, అతని ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్‌ ప్రతిపాదించాయి. అయితే.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 15 శాశ్వత సభ్య దేశాలుండగా.. 14 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి. ఒక్క చైనా మాత్రం దీన్ని హోల్డ్‌లో ఉంచి అడ్డుకుంది. దీంతో అబ్దుల్ రౌవూఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని ఇరుదేశాల అధికారులు తెలిపారు. దీనిపై ఇరుదేశాలు చైనాపై మండిపడ్డాయి.

అయితే.. ఈ ఏడాది జూన్‌లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనకు కూడా చైనా అడ్డుపడింది. అంతకుముందు జేషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించగా.. చైనా పలుమార్లు అడ్డుపడింది. అయితే చివరకు, అంతర్జాతీయ ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో అజార్‌ను 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు.

మసూద్‌ అజార్‌ సోదరుడైన అబ్దుల్ రౌవూఫ్‌ 1974లో పాకిస్థాన్‌లో జన్మించాడు. జైషే ముఠాలో అత్యంత కీలకంగా వ్యవహరించే రౌవూఫ్ పాకిస్థాన్‌లో యువతను ఉగ్రవాదం దిశగా ప్రేరేపించే వారిలో ఒకడు. 1999లో అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌లో భారత విమానాన్ని హైజాక్‌ చేసిన ఘటనలో రౌవూఫ్‌ ప్రధాన సూత్రధారి. ఆ తర్వాత 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వాయుసేన స్థావరంపై దాడి, అలాగే 2014-2019 మధ్య కాలంలో భద్రతా బలగాల సిబ్బందిపై జరిగిన అనేక దాడుల్లో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్‌లో రౌఫ్ అస్గర్, మసూద్ అజర్ పేర్లు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా.. టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలతో అస్గర్‌ను 2019 లో పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేశారు. అయితే అతడిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు.

ఇది కూడా చదవండి.. 

Airtel 5G: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..