AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మరుగుదొడ్డి కోసం కుమారుడితో కలిసి గుంత తవ్వుతున్న వ్యక్తి.. 2 మీటర్లు తవ్వగా కళ్లు జిగేల్..

ఆ వ్యక్తి కొత్త మరుగుదొడ్డి నిర్మించాలని అనుకున్నాడు. తన కుమారుడితో కలిసి గుంత తవ్వడం ప్రారంభించాడు. దాదాపు రెండు మీటర్ల లోతుకు తవ్విన తర్వాత వారికి నీలిరంగు రాయి కనిపించింది.

Viral: మరుగుదొడ్డి కోసం కుమారుడితో కలిసి గుంత తవ్వుతున్న వ్యక్తి.. 2 మీటర్లు తవ్వగా కళ్లు జిగేల్..
A representative image
Ram Naramaneni
|

Updated on: Aug 12, 2022 | 9:10 PM

Share

Trending: పురాతన కాలంలో దోపిడి దొంగలు, పరాయి రాజ్యాలను నుంచి దండెత్తి వచ్చే సైనికులు భయంతో చాలామంది తమ దగ్గర ఉన్న విలువైన ఆభరణాలు, నాణేలను నేలలో లేదా ఇంటి గోడల్లో దాచేవారు. ఆ తర్వాత కాలంలో వాటిని దాచిన వారు అనుకోకుండా కాలం చేయడం వల్ల ఆ నిధి అలాగే ఉండిపోయేది. కొన్ని సంవత్సరాలు, దశాబ్ధాలు, శతాబ్దాలు అనంతరం ఏదైనా తవ్వకాలు బయటపడిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే  కంబోడియా ప్రావిన్స్ వాయువ్య ప్రాంతంలోని ఓ గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ గ్రామం పేరు కోర్క్ వాట్. అక్కడ  సబోయున్ రాన్ అనే 42 ఏళ్ల వ్యక్తి  తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు కొత్త మరుగుదొడ్డి నిర్మించాలని అనుకున్నాడు. తన కుమారుడితో కలిసి గుంత తవ్వడం ప్రారంభించాడు. దాదాపు రెండు మీటర్ల లోతుకు తవ్విన తర్వాత వారికి నీలిరంగు రాయి కనిపించింది. వెంటనే రాయిని కడిగి శుభ్రపరిచిన అనంతరం అది ఒక పురాతన కాంస్య విగ్రహం అని గుర్తించి ఆశ్చర్యపోయారు. అలా ఇంకొంచం తవ్వగా మరో నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని తన ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించుకుని శాంతిని కోరుతూ వాటి ముందు ధూపం వెలిగించాడు. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అతని ఇంటికి చేరకున్న పోలీసులు ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.

“బోయున్ రాన్ విగ్రహాలను కనుగొన్న తర్వాత, అతను వాటిని వెంటనే అధికారులకు అప్పగించకుండా దాచిపెట్టాడు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఆ విగ్రహాలను స్వాధీనం చేసకున్నారు” అని ప్రావిన్షియల్ డైరెక్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌కు చెంది అధికారి హాంగ్ సోయున్ తెలిపారు. పోలీసులు తమ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత, విగ్రహాలను ప్రావిన్షియల్ మ్యూజియంలో ఉంచుతామని తెలిపారు. ఐదు పురాతన విగ్రహాలు 10వ లేదా 11వ శతాబ్దానికి చెందిన థోబ్ బాఫున్ శైలిలో ఉన్నాయని ఒక పురావస్తు శాస్త్రవేత్త తెలిపారు. (Source)

Ancient Statues

ఇది కూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.