World Elephant Day: అంతరించిపోతున్న జంతువుల్లో ఏనుగులు ఒకటి.. నేడు ఏనుగుల దినోత్సవం.. ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

ఆఫ్రికన్ ఏనుగులు "హాని కలిగించేవి"గా, ఆసియా ఏనుగులు "అంతరించిపోతున్నవి" గా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌ జాబితా చేర్చబడ్డాయి. ఆఫ్రికన్, ఆసియా ఏనుగులు పన్నెండు సంవత్సరాలలో అంతరించిపోతున్నాయని ఒక పరిరక్షణాధికారి చెప్పారు

World Elephant Day: అంతరించిపోతున్న జంతువుల్లో ఏనుగులు ఒకటి.. నేడు ఏనుగుల దినోత్సవం.. ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
World Elephant Day
Follow us
Surya Kala

|

Updated on: Aug 12, 2022 | 10:01 AM

World Elephant Day 2022: భూమి మీద భారీ జంతువు ఏనుగు.. మనిషి జీవన విధానం.. ఏనుగు జీవన విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులు భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అంతేకాదు తెలివి, జ్ఞాపకశక్తి కూడా ఎక్కువే. దంతాల కోసం, ఇతర శరీర భాగాల కోసం ఏనుగులను చంపేయడంతో ఏనుగుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. ఏనుగులకోసం ఒక దినోత్సవం ఉంటే వాటి రక్షణపై అవగాహన పెరిగుతుందన్న ఉద్దేశ్యంతో కెనడాలోని కెనజ్వెస్ట్ పిక్చర్స్ చిత్రనిర్మాతలు ఏనుగుల సంరక్షణ ప్రచారకులు ప్యాట్రిసియా సిమ్స్‌, మైఖేల్ క్లార్క్ 2011లో ఏనుగుల రక్షణ కోసం చర్యలు ప్రారంభించారు.

థాయిలాండ్లోని ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్దరానంద మద్దతుతో ప్యాట్రిసియా సిమ్స్, ఎలిఫెంట్ రీ ఇంట్రోడక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2012, ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం మొదలు పెట్టారు. అప్పటినుండి ప్యాట్రిసియా సిమ్స్ ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలోని 65కి పైగా వన్యప్రాణుల సంస్థలు, చాలామంది వ్యక్తులు ఏనుగుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.

ఏనుగుల గురించి వివరాలోకి వెళ్తే.. 

ఇవి కూడా చదవండి

ఆఫ్రికన్ ఏనుగులు “హాని కలిగించేవి”గా, ఆసియా ఏనుగులు “అంతరించిపోతున్నవి” గా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌ జాబితా చేర్చబడ్డాయి. ఆఫ్రికన్, ఆసియా ఏనుగులు పన్నెండు సంవత్సరాలలో అంతరించిపోతున్నాయని ఒక పరిరక్షణాధికారి చెప్పారు. ప్రస్తుతం ఆఫ్రికా ఏనుగుల సంఖ్య 4 లక్షలుండగా, ఆసియా ఏనుగులు నలభై వేలున్నాయి. ప్రస్తుత లక్ష్యం, ఆఫ్రికా, ఆసియాలోని ఏనుగుల గురించి అవగాహన కల్పించడం, అడవి ఏనుగుల రక్షణ కోసం చర్యలు తీసుకోవడం ఈ ఏనుగుల దినోత్సవ ముఖ్య లక్ష్యం..

ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే.. ఈ జంతువులు ఎదుర్కొనే సమస్యలను హైలైట్ చేసే రోజు.. ఏనుగులు అంతరించిపోవడానికి ముఖ్యకారణాలు..  అటవీ నిర్మూలన, బందిఖానా, మానవుల దుర్వినియోగం కారణంగా నివాసాలను కోల్పోవడం, వేటాడటం ద్వారా మరణించడం.  ఏనుగులు భూ పర్యావరణ వ్యవస్థను పర్యవేక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయ. కనుక ఏనుగులను సంరక్షించడం మానవ మనుగడకు చాలా అవసరం.

ఏనుగుల ఆవాసంగా స్థలం లేకుండా పోతుంది. కనుక జంబోస్ పరిరక్షణ కోసం సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికి అనేక స్వచ్చంద సంస్థలు పనిచేస్తున్నాయి. అటువంటి సంస్థలకు సంస్థలకు విరాళం ఇవ్వడానికి ప్రజలు ప్రయత్నించాలి. ఏనుగు దంతాలు, ఇతర వన్యప్రాణుల ఉత్పత్తుల అక్రమ వేట,  వ్యాపారాన్ని అరికట్టాలి. అడవి ఏనుగుల ఆవాసాలను రక్షించడానికి కృషి చేస్తున్న సంస్థలకు ప్రపంచ ఏనుగుల దినోత్సవ సందర్భంగా మద్దతు ఇవ్వాలని ప్రపంచ ఏనుగుల దినోత్సవం సహ వ్యవస్థాపకురాలు ప్యాట్రిసియా సిమ్స్ అన్నారు. పెంపుడు ఏనుగులు స్వేచ్ఛగా జీవించడానికి అభయారణ్యాలు, ప్రత్యామ్నాయ ఆవాసాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే