AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Pakistan: బుద్ది మార్చుకోని పాకిస్తాన్.. ఐక్యరాజ్యసమితి వేదికగా కడిగేసిన భారత ప్రతినిధి..

ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కశ్మీర్ జపం చేయడం పాకిస్తాన్ మానడం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళలు, శాంతి భద్రతలు’ చర్చలో పాక్ మరోసారి కశ్మీర్ పై పాత పాటను మరోసారి పాడింది.

India Vs Pakistan: బుద్ది మార్చుకోని పాకిస్తాన్.. ఐక్యరాజ్యసమితి వేదికగా కడిగేసిన భారత ప్రతినిధి..
India Vs Pakistan
Sanjay Kasula
|

Updated on: Mar 08, 2023 | 7:40 PM

Share

ఐక్యరాజ్యసమితి వేదికగా కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తేందుకు పాకిస్తాన్‌ చేసిన ప్రయత్నాలను భారత్‌ మరోసారి తిప్పికొట్టింది. కశ్మీర్‌పై ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే అని ఘాటుగా భారత ప్రతినిధి స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా మండలిలో ‘మహిళలు – శాంతి, భద్రత’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ జమ్ముకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. బిలావల్‌కు భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ చురకలు అంటించారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భద్రత, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలన్న అంశంపై చర్చ జరుగుతున్నవేళ జమ్మూకశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్‌ ప్రతినిధులు లేవనెత్తడం సిగ్గుచేటని అన్నారు. కశ్మీర్‌పై చేసిన అసత్య ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తునట్టు తెలిపారు. పాకిస్తాన్‌ ఇలాంటి అసత్య ఆరోపణలకు స్పందించడం దండగ అని అన్నారు రుచిరా కాంబోజ్‌.

బిలావల్ భుట్టో UN లో కాశ్మీర్ రాగం..

కాశ్మీర్ అంశంపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై రుచిరా కాంబోజ్ మంగళవారం స్పందిస్తూ, అతని ప్రకటన “నిరాధారమైన, రాజకీయ ప్రేరేపితమైనది” అని పేర్కొన్నారు. రుచిరా మాట్లాడుతూ, “నా ప్రసంగాన్ని ముగించే ముందు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గురించి పాకిస్తాన్ ప్రతినిధి చేసిన చౌకబారు, నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను నేను తిరస్కరిస్తున్నాను అని తెలిపారు.

గతంలో కూడా కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తడానికి పాకిస్తాన్‌ పలుమార్లు ప్రయత్నించింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని , దీనిపై ఎవరి జోక్యం అక్కర్లేదని భారత్‌ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో మంచి సంబంధాలే కోరుకుంటున్నాయని , కాని ఇలాంటి వైఖరిని మాత్రం సహించే ప్రసక్తే లేదని భారత్‌ తేల్చిచెప్పింది. తమ నుంచి స్నేహహస్తం ఆశించాలంటే పాకిస్తాన్‌ కూడా శాంతిని కోరుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఉగ్రవాదం , చొరబాట్ల విషయంలో పాకిస్తాన్‌ వైఖరి మారడం లేదు. కుక్క తోక వంకర లాగే పాకిస్తాన్‌ ప్రవర్తన ఉంది. జమ్ముకశ్మీర్‌పై చర్చలకు సిద్దమంటూనే పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం