G20 Meeting :పేద దేశాలను ఆదుకునేలా చూడాల్సిందే..జీ-20 కూటమికి ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా ‘అల్టిమేటం’
ప్రపంచ ధనిక దేశాలు పేద దేశాలను ఆదుకోకపోతే వాటి పరిస్థితి దారుణంగా మారుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జియవా జీ-కూటమిని హెచ్చరించారు. ఓ వైపు కోవిద్ పాండమిక్ తోను, మరోవైపు ఆర్ధిక వ్యవస్థలు దిగజారిపోతుండడంతోను పేద దేశాలు రెండు విధాలుగానూ...
ప్రపంచ ధనిక దేశాలు పేద దేశాలను ఆదుకోకపోతే వాటి పరిస్థితి దారుణంగా మారుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జియవా జీ-కూటమిని హెచ్చరించారు. ఓ వైపు కోవిద్ పాండమిక్ తోను, మరోవైపు ఆర్ధిక వ్యవస్థలు దిగజారిపోతుండడంతోను పేద దేశాలు రెండు విధాలుగానూ నష్టపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. ధనిక-పేద దేశాల మధ్య తారతమ్యం పెరిగిపోతోందని, వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న పేద దేశాలను ధనిక దేశాలు తక్షణమే ఆదుకునేలా చూడాలని జీ-20 కూటమిని కోరారు. ఈ వారంలో ఈ కూటమికి చెందిన ఆర్ధిక శాఖ మంత్రుల సెంట్రల్ బ్యాంకర్ల సమావేశం జరగనున్న నేపథ్యంలో తన బ్లాగ్ లో ఆమె ఈ హెచ్చరికలు. సూచనలు చేశారు. సొమ్ములు, నిధులు లేని దేశాలు తమ ప్రజలకు అవసరమైన కీలక ఇన్వెస్టిమెంట్లు లేక కునారిల్లుతున్నాయని… ఈ పరిస్థితిని గమనించాలన్నారు. ఇది చాలా క్లిష్ట తరమైన సమయం.. ప్రపంచ వ్యాప్తంగా గల పాలసీ మేకర్లు, జీ-20 దేశాధినేతలు దీనిపై దృష్టి పెట్టాలి.. ఇందుకు వెంటనే కార్యాచరణకు పూనుకోవాలి అని ఆమె సూచించారు.1984 నుంచి అమెరికా, చైనా వంటి దేశాలు అభివృద్ధి చెందుతూ వస్తుండగా వర్ధమాన దేశాలు మాత్రం వ్యాక్సిన్ల లభ్యత, ఇన్ఫెక్షన్ రేట్స్ వంటి వాటి విషయంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని, పాలసీల అమలుకు అవసరమైన సపోర్టు వీటికి అందడం లేదని ఆమె పేర్కొన్నారు.
ఈ సంవత్సరాంతానికి పేద దేశాలలోని కనీసం 40 శాతం జనాభాకు వ్యాక్సిన్లను సరఫరా చేయాలని, వచ్చే ఏడాది మొదటి 6 నెలల కాలంలో 60 శాతం ప్రజలకు ఇవి అందుబాటులో ఉండేలా చూడాలని ఆమె అన్నారు. కేవలం కోవిద్ పాండమిక్ ని ఎదుర్కొనేందుకే ఈ దేశాలకు 5 ఏళ్లలో సుమారు 200 బిలియన్ డాలర్లు అవసరమవుతాయన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.