AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai explosion: దుబాయ్‌లో భారీ పేలుడు.. జెబెల్ అలీ పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు..

దుబాయ్‌లో భారీ బ్లాస్ట్‌ జరిగింది. జెబెల్ అలీ పోర్టులో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి...

Dubai explosion: దుబాయ్‌లో భారీ పేలుడు.. జెబెల్ అలీ పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు..
Dubai Blast
Sanjay Kasula
|

Updated on: Jul 08, 2021 | 12:44 PM

Share

దుబాయ్‌లో భారీ బ్లాస్ట్‌ జరిగింది. జెబెల్ అలీ పోర్టులో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒక్కటైన  జెబెల్ అలీ పోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.  పేలుడు సంభవించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య కేంద్రంలో ప్రకంపనలు సృష్టించినట్లు అధికారులు తెలిపారు.

పేలుడు జరిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద శబ్దాలు వెలువడినట్లు పోర్టుకు దగ్గరలోని స్థానికులు తెలిపారు. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా హడలిపోయారంటే ఈ పేలుడు ధాటి ఎంత తవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు.

తూర్పు వైపున ఉన్న పెర్షియన్ గల్ఫ్‌లో   జెబెల్ అలీ పోర్టు వద్ద ఓడలో మంటలు సంభవించాయని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ట్విట్టర్ చేసింది.  ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెలుడుకు గల కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. నౌకలోని కంటైనర్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణమైన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. ప్రమాదం వెనుక ఏమైన అసాంఘిక శక్తులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : YSR Jayanti-YS Sharmila: మహానేతకు విజయమ్మ, షర్మిల నివాళులు.. YSR ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు..

 Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..