YSR Jayanti-YS Sharmila: మహానేతకు విజయమ్మ, షర్మిల నివాళులు.. YSR ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు..
ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ YS రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. YSR ఘాట్ వద్ద YS విజయమ్మ, YS షర్మిల నివాళర్పించారు. ఈ సందర్భంగా YSR ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. షర్మిలతోపాటు కుటుంబ కొడుకు, కూతురు కూడా ఉన్నారు.
ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ YS రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. YSR ఘాట్ వద్ద YS విజయమ్మ, YS షర్మిల నివాళర్పించారు. ఈ సందర్భంగా YSR ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు.
ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనల అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరుతారు. సాయంత్రం.5గంటలకు పార్టీ ఆవిర్భావంపై ప్రకటన చేయనున్నారు షర్మిల. పార్టీ జెండా, అజెండా ఖరారు చేస్తారు. జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్‌టీపీ జెండాను ఆవిష్కరిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు..కడపకు చేరుకుంటారు సీఎం జగన్. ఇడుపులపాయలో వైఎస్సార్‌కు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్.