Lightning strikes: తెలంగాణలో పిడుగుల వర్షం.. ఒక్కరోజే వేరు.. వేరు చోట్ల తొమ్మిది మంది మృతి
గడిచిన 24గంటల్లో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే పరిస్థితి.. ఊహించనంత ప్రమాదకరంగా మారింది.
తెలుగు రాష్ట్రాలను వరుణుడు ముంచేశాడు. వర్షాకాలం మొదలైందో లేదో.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకి జనం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మూగజీవాలు సైతం చనిపోయాయి. గడిచిన రెండ్రోజుల్లో చనిపోయిన వాళ్ల సంఖ్య చూస్తే .. గడిచిన 24గంటల్లో పలు ప్రాంతాల్లో కుంభవృష్టి పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే పరిస్థితి.. ఊహించనంత ప్రమాదకరంగా మారింది. ఎంతగా అంటే ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చిన వరదనీటితో ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతం పరుగులు పెడుతోంది. వరదలే కాదు తెలంగాణలో కురిసిన వర్షాలు, పిడుగులు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. నిన్న కురిసిన భారీ వర్షాలు, పడ్డ పిడుగులకు రాష్ట్రంలో 9మంది మృత్యువాత పడ్డారు. కుండపోత వానకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆసిఫాబాద్ మండలంలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలావుంటే భారీ వర్షాలకు తోడు.. పిడుగులు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు, పిడుగుల ధాటికి రాష్ట్రంలో తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, వరంగల్‌లో ఇద్దరు, నిర్మల్‌ల్లో ఇద్దరు, ఖమ్మంలో ఒకరు మృతి పిడుగుపాటుకు బలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మూగజీవాలు చనిపోయాయి.
ముధోల్‌లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. కుంటాల మండలం విట్టాపూర్‌లో విజయ్, తానూర్ మండలం కొలుర్‌లో మాధవ్‌రావు పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడటంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. విజయ్ భార్యకు తీవ్రగాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదిలాబాద్ జిల్లా కూచులపుర్‌లో పిడుగుపడటంతో కారం లక్ష్మన్ అనే రైతు మృతి చెందగా..మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.