చిన్న స్క్రూ ఎంత పని చేసింది ! హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిందిగా..

హెల్మెట్ లేకపోయినా కాస్తా స్పీడ్‏గా పెంచి..సిగ్నల్ జంప్ చేసిన ఫోటో పడాల్సిందే.. అలా మనకు తెలియకుండానే.. మన వాహనంపై ఎన్నో చలాన్లు వెబ్‏సైట్‏లో మన వెహికల్ నంబర్ పై దర్శనమిస్తుంటాయి.

చిన్న స్క్రూ ఎంత పని చేసింది ! హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిందిగా..
Traffic
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 08, 2021 | 10:35 AM

హెల్మెట్ లేకపోయినా కాస్తా స్పీడ్‏గా పెంచి..సిగ్నల్ జంప్ చేసిన ఫోటో పడాల్సిందే.. అలా మనకు తెలియకుండానే.. మన వాహనంపై ఎన్నో చలాన్లు వెబ్‏సైట్‏లో మన వెహికల్ నంబర్ పై  దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా అవే తలనొప్పిగా మారుతుంటాయి. ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ ఉండి క్లిక్ చేసినా బండి నంబర్ కరెక్ట్‏గా పడుతుంది. అయితే ఓ చిన్న స్క్రూ మాత్రం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఏకంగా వాహనం అడ్రస్‏నే మార్చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనంపై కాకుండా మరో వాహనంపై ఈ-చలాన్ జారీ అయ్యేలా చేసింది. దీంతో బాధితుడు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది.

టీఎస్ 5570 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన వాహనం నెంబర్ ప్లేట్‏పై మొదటి అంకె ” 5 ” చివరలో స్క్రూను బిగించారు. దీంతో దూరం నుంచి చూసేవాళ్లకు అది ” 6 “గా కనిపిస్తోంది. ఇంకేముంది 5570 కాస్తా 6570గా అందరికి కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని 5570 యజామాని కూడా అంతగా గమనించినట్లు లేడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులు తీసిన స్టిల్ కెమెరాల్లో ఈ నెంబర్ క్యాప్చర్ అయ్యింది. ఇక ఆ వాహనం నెబర్ 6570గా భావించి ఈ-చలాన్లు పంపుతూ వచ్చారు పోలీసులు. అయితే తన వాహనంపై చలాన్లు రావడం చూసిన యజమాని..గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తన వాహనం నంబర్ ఉపయోగిస్తున్నారని సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని నగర ట్రాఫిక్ పోలీసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు అసలు విషయంపై ఆరా తీశారు. అయితే 5570 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిందని.. కానీ.. నెంబర్ ప్లేట్ బిగించడానికి వాడిన స్క్రూ కారణంగా.. అది 6570గా కనిపించిందని గుర్తించారు. దీంతో ఆ చలాన్లు అన్ని అసలైన వాహనదారునికి విధించారు.

Also Read: Coronavirus: కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరస్థితిలో ఉంది.. 40 లక్షల కరోనా మరణాలు: డబ్ల్యూహెచ్‌వో

Indian Railways: రైల్వే ప్రయాణికుల భద్రత కోసం 813 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఐపీ ఆధారిత సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

Almonds for Diabetes: డయాబెటిక్‌ పేషెంట్స్‌కి గుడ్‌న్యూస్.. బాదంతో మహమ్మారికి చెక్.. ఎలా అంటే..