ఎలుకల బీభత్సం.. నిద్రిస్తున్న మహిళ కనుగుడ్డును తినేసిన మూషికం..!

ప్రపంచ దేశాలను కరోనాతో భయపడుతుంటే.. ఆస్ట్రేలియా మాత్రం ఎలుకలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇళ్లలో, పంట పొలాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లలో వందల కొద్ది ఎలుకలు బీభత్సం చేస్తున్నాయి.

ఎలుకల బీభత్సం.. నిద్రిస్తున్న మహిళ కనుగుడ్డును తినేసిన మూషికం..!
Rat
Follow us
Venkata Chari

|

Updated on: Jul 08, 2021 | 1:50 PM

ప్రపంచ దేశాలను కరోనాతో భయపడుతుంటే.. ఆస్ట్రేలియా మాత్రం ఎలుకలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇళ్లలో, పంట పొలాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లలో వందల కొద్ది ఎలుకలు బీభత్సం చేస్తున్నాయి. ఏం చేయలేని స్థితిలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలుకల బెడదతో రైతులు చాలా నష్టపోతున్నారు. వాటివల్ల నిద్రలేని రాత్రులు గడిపి హాస్పిటల్స్‌లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే తాజాగా ఓ సంఘటనను చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఓ రైతు భార్యపై దాడి చేసి ఓ ఎలుక.. ఏకంగా ఆమె కనుగుడ్డును తినేసిందంట. నిద్ర నుంచి మేల్కొని చూసిన ఆమె షాక్‌కు గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అసలు విషయంలోకి వెళ్తే.. ది న్యూయార్క్ పోస్ట్ కథనం మేరకు.. ఎలుకల బెడదతో అక్కడి ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. మిలియన్ల కొద్ది ఎలుకలు రైతులు పండించిన పంటలను నాశనం చేస్తూ.. తీవ్రంగా నష్టపెడతున్నాయి. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయంట. ఇళ్లలోకి దూరి ఆహార పదార్థాలను కూడా తినేస్తున్నాయంట. వీటితో జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే, న్యూసౌత్ వేల్స్‌లో నివసిస్తున్న ఓ రైతు కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. నిద్రిస్తున్న రైతు భార్యపై ఓ ఎలుక దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆమె లేచి చూసే సరికి.. కనుగుడ్డును తింటున్న ఎలుకను చూసి ఒక్కసారిగా కేకలు వేసిందంట. దాంతో పక్కనే ఉన్న ఆమె భర్త వెంటనే ఆమెను హాస్పిటల్‌రే తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆ రైతు తన బాధను చెప్పుకొచ్చాడు. మరోవైపు ఎలుకలను చంపేందుకు ప్రభుత్వం కూడా పెద్ద సంఖ్యలో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, అవి కొంతమేర ఫలితాన్ని ఇస్తున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం ఫలించడం లేదని ప్రజలు వాపోతున్నారు. రోజంతా జనాలు ఎలుకలను చంపే పనిలో నిమగ్నమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఎలుకలు సగటున రెండు ఏళ్లకు పైగా జీవిస్తాయంట. ఆగ ఎలుకలు కేవలం 6 వారాల్లోనే సంతానోత్పత్తికి సిద్ధమవుతాయంట.

ఆస్ట్రేలియాలో ఎలుకలు పెద్ద ఎత్తున కనిపించడం ఇదే మొదటి సారి కాదు. 1787లో మొదటిసారి ఎలుకలు కనిపించాయంట. ఇవి బ్రిటన్ నుంచి ఓ షిప్ లో వచ్చినట్లు కనుగొన్నారు. ఆ తరువాత ప్రతీ నాలుగేళ్లకు ఓసారి వేల సంఖ్యలో ఎలుకలు కనిపిస్తూనే ఉన్నాయంట. మరీ ముఖ్యంగా రైతులు పంటలు కోసే సమయంలో మాత్రం వీటి ఆగడాలకు అంతే లేకుండా పోతోందంట. కాగా, 1993లో ఎలుకల వల్ల కలిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తే.. దాదాపు 96 మిలియన్లని తేలిందంట. మరోవైపు ఎలుకలు కేవలం తినే పదార్థాలను పాడు చేయడమే కాకుండా కోళ్లు, ఆవులతోపాటు గేదెలను కూడా కరుస్తుండడంతో.. వాటి నుంచి మరిన్ని వ్యాధులు వ్యాప్తి చెందుతున్నయంట. మొత్తానికి ఎలుకతో ఆస్ట్రేలియా ఆగమాగం అవుతోంది.

Also Read:

Chital: గ్రావిటీ కెనాల్‌లో పడి దుప్పి మృత్యువాత.. కాపాడలేకపోయిన స్థానికులు.. వీడియో..

Viral Video: పెళ్లికి అడ్డుకాని అంగవైకల్యం..”ఒంటికాలు పెళ్లికొడుకు” ఇరగదీసిండు.. మనసును హత్తుకునే వీడియో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!