Chital: గ్రావిటీ కెనాల్‌లో పడి దుప్పి మృత్యువాత.. కాపాడలేకపోయిన స్థానికులు.. వీడియో..
Chital fell into the Canal: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు జంతువులు తరుచూ మృత్యువాత పడుతున్నాయి. తాజాగా గ్రావిటీ కెనాల్‌లో పడి
Chital fell into the Canal: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు జంతువులు తరుచూ మృత్యువాత పడుతున్నాయి. తాజాగా గ్రావిటీ కెనాల్‌లో పడి దుప్పి మృతిచెందింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్ హౌస్ నుంచి.. అన్నారం బ్యారేజ్‌కి నీటిని తరలించే గ్రావిటీ కెనాల్‌లో ప్రమాదవశాత్తు దుప్పి పడింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంలో వల్ల దుప్పి కొట్టుకుపోయి మరణించింది. అయితే.. కెనాల్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వన్యప్రాణిని కాపాడలేకపోయామని స్థానికులు వెల్లడించారు. కెనాల్‌లో పడిన దుప్పి చాలాదూరం పాటు ప్రవాహంలో కొట్టుకుపోయింది. నీటి నుంచి బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ.. నీటి ప్రవాహం వల్ల బయటపడలేకపోయింది.
అయితే.. తరచుగా ఈ ప్రాంతంలో దుప్పులు కెనాల్‌లో పడి మృతి చెందుతుండడంతో వన్య ప్రాణుల భద్రత కోసం పెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. దుప్పి నీటిలో పడి మృతిచెందిన విషయంపై.. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడకు చేరుకుని చనిపోయిన దుప్పిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: