Patancheruvu Accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు దుర్మరణం..
Road Accident: హైదరాబాద్ నగర శివార్లలోని పటాన్‌చెర్వులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి
Road Accident: హైదరాబాద్ నగర శివార్లలోని పటాన్‌చెర్వులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెర్వు ఇస్నాపూర్ వద్ద జరిగింది. ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్‌లో ఇద్దరు.. వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. జిల్లాలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామం వద్ద బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా…మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు వరంగల్ గొర్రెకుంట, కీర్తినగర్ కి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Also Read: