‘సమ్ థింగ్ ఇన్ కిమ్’..బాగా బరువు తగ్గి సన్నబడిపోతున్నాడట…!! నో డౌట్ అంటున్న సౌత్ కొరియా…
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 44 పౌండ్ల బరువు తగ్గినట్టు సౌత్ కొరియాకు చెందిన గూఢఛార సంస్థ వెల్లడించింది. అయితే తగ్గితే తగ్గాడు గానీ ఆయనకు పెద్ద ఆరోగ్య సమస్యలు లేవని ఈ ఏజెన్సీ తెలిపింది.
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 44 పౌండ్ల బరువు తగ్గినట్టు సౌత్ కొరియాకు చెందిన గూఢఛార సంస్థ వెల్లడించింది. అయితే తగ్గితే తగ్గాడు గానీ ఆయనకు పెద్ద ఆరోగ్య సమస్యలు లేవని ఈ ఏజెన్సీ తెలిపింది. ఎలా లేదన్నా ఆయన పది నుంచి 20 కేజీలు వెయిట్ తగ్గినట్టు ఈ సంస్థ తరఫున కిమ్ బ్యుమ్గ్ కీ అనే ఎంపీ చెప్పాడు. కిమ్ ఆరోగ్యంలో ఏవైనా మార్పులు ఉంటే డ్రగ్స్ తీసుకుంటున్నాడని అనుకోవచ్చునని కానీ ఆ దాఖలాలు కనబడడం లేదని ఆయన అన్నాడు. కిమ్ ఆరోగ్యాన్ని, ఆయన బాగోగులు చూసుకునే ఇన్-ఛార్జి నిర్వహిస్తున్న క్లినిక్ కి డ్రగ్స్ దిగుమతి అవుతున్న సూచనలు తమకు కనబడలేదన్నారు. ఏమైనా కిమ్ వీటిని తీసుకుంటున్నాడని చెప్పలేమని అభిప్రాయపడ్డాడు. నార్త్ కొరియా అధ్యక్షుడు ఇంకా గంటల కొద్దీ తమ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తుంటాడని, ఆయన ఎలా నడుస్తాడన్న దానిలో అసాధారణమేమీ అగుపించలేదని పేర్కొన్నాడు.
కిమ్ బరువు తగ్గాడా..తగ్గితే ఎన్ని కేజీలు తగ్గదు వంటి అంశాలను సౌత్ కొరియా గూఢచార సంస్థలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాయట. ఆయన కుటుంబ వ్యక్తులకు గుండె జబ్బులున్న కారణంగా ఇవి ఈ పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. కిమ్ సుమారు 140 కిలోల బరువు ఉన్నట్టు గత నవంబరులో దక్షిణ కొరియాకే చెందిన మరో ఎంపీ కూడా తెలిపాడు. కానీ తాము ఖచ్చితమైన అంచనా వేయలేకపోయినట్టు చెప్పాడాయన.కిమ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నాడనడానికి ఆధారాలు లేవని ఆయన చెప్పాడు. తమ ఎటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ సుమారు 9 రోజుల పాటు హ్యాక్ అయిందని..కానీ అత్యంత కీలకమైన సమాచారం లీక్ కాలేదని ఆ ఎంపీ పేర్కొన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Pawan kalyan – Sharmila Party: వైయస్ షర్మిల పొలిటికల్ పార్టీపై జనసేనాని రియాక్షన్
AP Inter Results: జులై 31లోగా ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. మార్కులు ఎలా ఇవ్వనున్నారో తెలుసా.?