జెఫ్ బెజోస్ తో రోదసి ట్రిప్ కి వెళ్లొచ్చిన కుర్రాడు అమెజాన్ నుంచి ఏదీ కొనలేదట ! నమ్మాలా ..?
అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ తో బాటు రోదసి ట్రిప్ కి వెళ్లొచ్చిన 18 ఏళ్ళ కుర్రాడు చెప్పిన సమాధానం విని బెజోస్ తో బాటు అంతా ఆశ్చర్యపోయారు. డచ్ కి చెందిన ఈ టీనేజర్..
అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ తో బాటు రోదసి ట్రిప్ కి వెళ్లొచ్చిన 18 ఏళ్ళ కుర్రాడు చెప్పిన సమాధానం విని బెజోస్ తో బాటు అంతా ఆశ్చర్యపోయారు. డచ్ కి చెందిన ఈ టీనేజర్.. న్యూ షెఫర్డ్ రాకెట్ లో అంతరిక్ష యానం చేశాడు. ఇతని పేరు ఆలివర్ డేమెన్.చాకులా ఉన్న ఈ అబ్బాయి.. జెఫ్ కి తాను ఇదే మాట చెప్పానని, కానీ ఆయన లైట్ తీసుకున్నాడని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాడు.అమెజాన్ నుంచి నేను ఏదీ కొనలేదు.. తీసుకురాలేదు. అని నిర్మొహమాటంగా చెప్పాడట. ఈ ట్రిప్ కి ఎంపికైన ఓ వ్యక్తి ఇందుకు 28 మిలియన్ డాలర్లు చెల్లించినప్పటికీ చివరి క్షణంలో తన యోచనను విరమించుకున్నాడు. దాంతో ఈ డచ్ కుర్రాడికి ఛాన్స్ దక్కింది. ఆ వ్యక్తి క్యాన్సిల్ చేసుకున్నాడు గనుక ఇక నువ్వు రావాలి అని బెజోస్ కోరాడని, తన కుటుంబంతో కలిసి ఇటలీకి హాలిడే వెకేషన్ కి వెళ్లాలనుకున్న తాను..అది క్యాన్సిల్ చేసుకుని ఈ ట్రిప్ కి ఒప్పుకున్నానని తెలిపాడు. దీనికోసం తాను 28 మిలియన్ డాలర్లు చెల్లించలేదని.. కానీ తనను సెలెక్ట్ చేశారని ఆలివర్ చెప్పాడు.నేను వయస్సులో చిన్నవాడ్ని ..పైగా పైలట్ గా కాసోకూస్తో అనుభవం ఉంది గనుక బహుశా నన్ను ఎంపిక చేసుకుని ఉండవచ్చు అన్నాడు.
మొత్తానికి ఈ రోదసి ట్రిప్ ని భలే ఎంజాయ్ చేశానని వెల్లడించాడు. ఈ జాలీ ట్రిప్ కి వెళ్ళడానికి ముందు రెండు రోజులు ట్రెయినింగ్ ఇచ్చారట. జెఫ్ బెజోస్ తో బాటు అతని బ్రదర్ మార్క్ బెజోస్, 82 ఏళ్ళ మహిళా ఏవియేటర్ వాలీ ఫంక్ కూడా ఆలా షికారుగా ‘పైకి’ వెళ్లి వచ్చింది. ఇలా రోదసి యానం చేసినవారిలో అతి పెద్ద వయస్కురాలు ఈమె అయితే అతి పిన్న వయస్కుడు ఆలివర్ డేమెన్. .
మరిన్ని ఇక్కడ చూడండి: Bajrangi Bhaijaan : ‘భజరంగీ భాయ్‌జాన్’ సినిమాని రాజమౌలి నిరాకరించాడు..! కారణమేంటో చెప్పిన విజయేంద్ర ప్రసాద్