Two Headed Snake: వామ్మో రెండు తలల పాము.. ఎలుకల్ని ఎలా తింటోందో చూడండి.. Viral Vedio
పాములను చూస్తేనే భయం వేస్తుంది అందరికీ. కొంతమంది అయితే, పాము పేరు చెబితే హడలి పోతారు. కానీ, కొందరు సరదాగా పాములను పెంచుకోవడం కనిపిస్తుంది.
Two Headed Snake: పాములను చూస్తేనే భయం వేస్తుంది అందరికీ. కొంతమంది అయితే, పాము పేరు చెబితే హడలి పోతారు. కానీ, కొందరు సరదాగా పాములను పెంచుకోవడం కనిపిస్తుంది. పాములను జాగ్రత్తగా పెంచుకుని వాటితో కాలక్షేపం చేసేవారు కొందరుంటారు. పాములతో స్నేహం మంచిది కాదని తెలిసినా వారు ఆ పని మానరు. అయితే, అత్యంత అరుదుగా కనిపించే పాములు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో రెండు తలల పాము ఒకటి. ఒక తలతో ఉన్న పామును చూస్తేనే వణుకు వస్తుంది. అటువంటిది ఈ రెండు తలల పాము అని అనగానే ఒళ్ళు గుగుర్పాటుకు గురవుతుంది.
కానీ, జంతువుల కోసం ప్రపంచమంతా సాహస యాత్రలు చేసే బ్రియాన్ బార్జిక్ ఓ రెండు తలల పామును పెంచుకుంటున్నాడు. ఆ పాముతో కలిసే తన సాహస యాత్ర చేస్తున్నాడు. అతను సోషల్ మీడియాలో తన రెండుతలల పామును ప్రదర్శించాడు. అదేదో మామూలుగా ఓ ఫోటో తీసి పెట్టేయడం కాదు. ఏకంగా ఓ వీడియో పెట్టేశాడు. ఆ వీడియోలో ఆ రెండు తలల పాము రెండు తలలతోనూ ఎలుకల్ని తినేస్తోంది. చూడగానే ఆమ్మో అనిపించేలా ఉంది ఈ వీడియో. అన్నట్టు ఈ పాము రెండు తలలకీ వేరువేరు పేర్లు పెట్టుకున్నాడు బ్రియాన్.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ” నా రెండు తలల పాము బెన్-జెర్రీ ఎలుకల్ని ఎలా తినేస్తోందో చూడండి.” అంటూ కామెంట్ పెట్టిమరీ షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారిపోయింది. పోస్ట్ చేసిన దగ్గరనుంచీ ఈ పోస్ట్ కు రెండు లక్షల పాతిక వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఆ రెండు తలల పాము వీడియో పోస్ట్ మీరూ ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ రెండు తలల పామును చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నేనెప్పుడూ ఇలాంటిది చూడలేదని చాలా మంది కామెంట్ చేశారు. చాలా బావుంది అని కూడా కొందరు కామెంట్ చేశారు. ఎక్కువ మంది ఆశ్చర్యపోతూ వావ్ అంటూ కామెంట్ చేశారు.
Also Read: Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ..? ట్రక్కులో స్విమ్మింగ్.. నెటిజన్లు షాక్
నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో అరుదైన ఉభయచర జీవులు సందడి.. వీడియో