AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Warming: గ్లోబల్ వార్మింగ్ వలన లాభాలూ ఉన్నాయంటున్నారు.. ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

గ్లోబల్ వార్మింగ్ అనే పదం వింటేనే ఆమ్మో అని అనిపిస్తుంది. అంతలా దాని ప్రభావం ఉంటుందనే భయం అందరిలో ఉంది. అయితే, గ్లోబల్ వార్మింగ్ వలన ఓ పెద్ద ఉపయోగం కూడా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

Global Warming: గ్లోబల్ వార్మింగ్ వలన లాభాలూ ఉన్నాయంటున్నారు.. ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Global Warming
KVD Varma
|

Updated on: Jul 24, 2021 | 5:44 PM

Share

ప్రపంచంలోని గ్లోబల్ వార్మింగ్ వలన ప్రయోజనాలూ ఉన్నాయంటున్నారు అమెరికా శాత్రవేత్తలు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా, దేశంలో, ప్రపంచంలో డెంగ్యూ కేసులు తగ్గవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈడెస్ ఈజిప్టి దోమ డెంగ్యూ వైరస్ క్యారియర్‌గా మారినప్పుడు, దానిలో వేడిని సహించే గుణం బాగా తగ్గిపోతుంది అని పరిశోధన నిర్వహించిన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఎలిజబెత్ మెక్‌గ్రాత్ చెప్పారు. ఇంతేకాకుండా, దోమలలో ఈ డెంగ్యూ వ్యాధిని నివారించే బ్యాక్టీరియా వోల్బాచియా కూడా చాలా చురుకుగా మారుతుంది. అందువల్ల, గ్లోబల్ వార్మింగ్ కారణంగా, డెంగ్యూ కేసులు తగ్గవచ్చని వారు వివరిస్తున్నారు.

ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దోమలు అలసటగా మారుతాయి..

ఇండోనేషియాలో డెంగ్యూ కేసులను తగ్గించడానికి కొత్త ప్రయోగం జరిగింది. వోల్బాచియా బ్యాక్టీరియాను దోమల్లోకి ప్రవేశపెట్టారు. ఈ బాక్టీరియం డెంగ్యూ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తుంది. ఈ దోమలను బహిరంగంగా విడుదల చేశారు. ఈ దోమలు విడుదలయ్యే డెంగ్యూ కేసుల్లో 77 శాతం తగ్గింపు ఉందని పరిశోధనలో వెల్లడైంది. పరిశోధకులు ఎలిజబెత్ దోమలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రయోగం నిర్వహించారు. డెంగ్యూ,  వోల్బాచియా బారిన పడిన దోమలను వేడి నీటిలో ముంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో వాటిని సీసాలో ఉంచారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత వేసవిలో 42 డిగ్రీలకు చేరుకుంటుంది.

ప్రయోగం తరువాత, దోమలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద బద్ధకంగా మారడం ప్రారంభించి చనిపోయాయి. డెంగ్యూ బారిన పడిన దోమలు బలహీనపడి 3 రెట్లు వరకు బద్ధకంగా మారాయని ఫలితాలు వెల్లడించాయి. అదే సమయంలో, వోల్బాచియా బ్యాక్టీరియా సోకిన దోమలు 4 రెట్లు ఎక్కువ సోమరితనం అయ్యాయి. డెంగ్యూ వైరస్, వోల్బాచియా బ్యాక్టీరియా సోకిన దోమలు వేడి ఉష్ణోగ్రతలలో బలహీనపడతాయని పరిశోధనలో తేలింది. ఈ వ్యాధులు వ్యాప్తి చెందవు. వేడిని తట్టుకునే వాటి  సామర్థ్యం తగ్గుతుంది. దీంతో దోమలు ఎగరలేవు.

వేడి వాతావరణంలో వైరస్ దోమలో పెరగలేదు..

పరిశోధకుడు ఎలిజబెత్ వేడిలో దోమలో ఉన్న డెంగ్యూ వైరస్ అసలు ప్రత్యుత్పత్తి చేయలేకపోయింది. అంటే, ఈ వైరస్ వేడిలో దాని సంఖ్యను పెంచదు. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగితే, డెంగ్యూ కేసుల సంఖ్య తగ్గుతుంది. డెంగ్యూ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇప్పటివరకు దీనికి సమర్థవంతమైన చికిత్స కనిపెట్టలేదు.

Also Read: Delta Variant: రెండు డోసుల టీకా తీసుకున్నా కరోనా ఆగట్లేదు.. కారణాలేమిటి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Monsoon Hair Care: వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే..