ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తూ వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు
ఆస్ట్రేలియాలో ప్రభుత్వం విధించిన కఠిన లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తూ సిడ్నీ, మెల్ బోర్న్ నగరాల్లో శనివారం వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. తమకు స్వేచ్ఛ కావాలి (ఫ్రీడమ్) అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని ఆనేక చోట్ల ర్యాలీలు నిర్వహించారు.
ఆస్ట్రేలియాలో ప్రభుత్వం విధించిన కఠిన లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తూ సిడ్నీ, మెల్ బోర్న్ నగరాల్లో శనివారం వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. తమకు స్వేచ్ఛ కావాలి (ఫ్రీడమ్) అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబట్టుకుని ఆనేక చోట్ల ర్యాలీలు నిర్వహించారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. శనివారం ఒక్క రోజే 178 కోవిడ్ కేసులు నమోదు కావడంతో, ఇన్నాళ్లూ లాక్ డౌన్ విషయంలో తటపటాయిస్తూ వచ్చిన ప్రభుత్వం కఠిన లాక్ డౌన్ విధించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటికి వస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించింది. అయితే ప్రజలు దీంతో ఆగ్రహం చెందారు. న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎవరూ మాస్కులు సైతం ధరించలేదు. ఈ లాక్ డౌన్ తమను చంపేస్తోందని, తమ వ్యాపారాలు సాగడంలేదని కొందరు వ్యాపారులు చెప్పారు.
తమను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై నిరసనకారులు ప్లాస్టిక్ బాటిల్స్ ను విసిరివేశారు. మరికొంతమంది మండుతున్న క్రాకర్స్ ని విసురుతూ .పోలీసులను దుర్భాషలాడారు. సిడ్నీలో నిన్న నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో ప్రజల ఆగ్రహానికి అంతులేకపోయింది. కాగా ఫైజర్ వ్యాక్సిన్ ఆస్ట్రేలియాకు తగినంత సరఫరా కాకపోవడంతోను. ఇతర వ్యాక్సిన్ల సేఫ్టీపై అనుమానాలు తలెత్తడంతోను ఆస్ట్రేలియాలో ప్రజలు వ్యాక్సిన్ ]తీసుకోవడానికి విముఖత చూపుతున్నారు. దేశంలో ఇప్పటివరకు కేవలం 12 శాతం మంది మాత్రమే టీకామందు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతున్నందుకు తాను బాధ్యత వహిస్తానని ప్రధాని స్కాట్ మారిసన్ నిన్న ప్రకటించారు. దేశంలోని పరిస్థితిపై ఆయన కూడా తన నిస్సహాయతను వ్యక్తం చేశారు..
మరిన్ని ఇక్కడ చూడండి: Ananthapuram District: బిడ్డకు జలుబు మందు తెచ్చేందుకు బయటకు వెళ్లింది.. బ్రతుకే ముగిసిపోయింది