ఆమ్మో ! ఎంత పెద్ద గుడ్డో ! పాన్ పై పెట్టి ఉడికించి తినేసిన నార్వే హంటర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
నార్వేలో ఓ వ్యక్తి సాధారణ పక్షులకన్నా బలమైనవి, ఎత్తయిన ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి) గుడ్డునొకదానిని సేకరించి ఆమ్లెట్ లా వండుకుని తినేశాడు. సాధారణ గుడ్డు కన్నా అతి పెద్దది..బరువైనదైన ఈ ఎగ్ ను ఆయన ఎంతో కష్టపడి సంపాదించాడట...
నార్వేలో ఓ వ్యక్తి సాధారణ పక్షులకన్నా బలమైనవి, ఎత్తయిన ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి) గుడ్డునొకదానిని సేకరించి ఆమ్లెట్ లా వండుకుని తినేశాడు. సాధారణ గుడ్డు కన్నా అతి పెద్దది..బరువైనదైన ఈ ఎగ్ ను ఆయన ఎంతో కష్టపడి సంపాదించాడట. నార్మల్ గా ఉష్ట్ర పక్షులు తమ గుడ్లను అతి పదిలంగా కాపాడుకుంటాయి. గుడ్డును పొదిగి పిల్లలు బయటకు వచ్చేంతవరకు కదలవు. కానీ తమ దేశంలోని అడవుల్లో వేట సాగించే ఈ వ్యక్తి అరుదైన ఈ గుడ్డును సేకరించాడు. ఎంచక్కా దాన్ని పగులగొట్టి సొనను పాన్ పై వేశాడు.. ఉడికించి చిల్లీ ఫాదర్ (కారం), సాల్ట్ (ఉప్పు), పెప్పర్ కలిపిలొట్ట లేస్తూ తిన్నాడు. అన్నట్టు దీనికి రెండు మూడు బ్రెడ్ ముక్కలు కూడా జోడించాడట.ఫైర్ కిచెన్ అనే యూట్యూబ్ ఛానెల్ లో గత ఏడాది రిలీజైన ఈ వీడియోకు పది లక్షలపైగా వ్యూస్ రాగా 11 వేలకు పైగా లైక్స్ ని ఇది దక్కించుకుంది.
ఈ వీడియో చూసిన యూజర్లలో చాలామంది చాలా రకాలుగా స్పందించారు. వామ్మో ఎంత పెద్ద గుడ్డో..ఇంత పెద్ద ఎగ్ ని తన లైఫ్ లో చూడలేదని ఒకరంటే.. తన డైలీ డైట్ కి ఇలాంటి ఒక గుడ్డు ఉంటే చాలునని మరొకరు అన్నారు. ఇంతకీ ఇది ప్రోటీన్ రిచేనా అని ఇంకొకరు సందేహం వ్యక్తం చేశారు. ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుందేమో అని ఓ యూజర్ వ్యాఖ్యానిస్తే…ఒంట్లో హీట్ ఇంకా పెరిగిపోతుందేమోనని మరో యూజర్ ఉసూరుమన్నాడు. అసలే ఉష్ట్ర పక్షి..బలంగా ఉంటుంది కూడా.. మనం కూడా దాని ఎగ్ ని ఇలా తినడం మంచిదేనని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.