Salman Rushdie: రష్దీ అంటే ఇష్టం లేకనే.. రచయిత సల్మాన్ రష్దీ హత్యాయత్నం నిందితుడు సంచలన వ్యాఖ్యలు..
ఓ యువకుడు స్టేజిపైకి వచ్చి దారుణంగా కత్తితో పొడవడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ రష్దీ హత్య వెనుక ఎవరి ప్రమేయం లేదని.. రష్దీ అంటే ఇష్టం లేకనే..
Salman Rushdie: అమెరికాలోని న్యూయార్క్ లో భారత రచయిత సల్మాన్ రష్దీ హత్యాయత్నం కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ యువకుడు స్టేజిపైకి వచ్చి దారుణంగా కత్తితో పొడవడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ రష్దీ హత్య వెనుక ఎవరి ప్రమేయం లేదని.. రష్దీ అంటే ఇష్టం లేకనే హత్య చేశానని నిందితుడు హదీ మతార్ తెలిపాడు. జైలులో ఉన్న నిందితుడు ఓ వార్తా సంస్థతో వీడియో లింక్ ద్వారా మాట్లాడాడు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. సల్మాన్ రష్దీ చిత్తశుద్ధి లేని వ్యక్తి అని.. అతడంటే తనకు నచ్చడని చెప్పాడు. తనకు తానుగానే దాడికి పాల్పడ్డాని.. అప్పుడే రష్దీ చనిపోయాడనుకున్నట్లు తెలిపాడు. సల్మాన్ రష్దీ ఇంకా బతికే ఉన్నాడంటే నమ్మలేకపోతున్నానని అన్నాడు. సల్మాన్ రష్దీ రాసిన నవల ‘ది సటానిక్ వెర్సస్’ లో కొన్ని పేజీలే చదివానని, పూర్తిగా చదవలేదన్నారు. రష్దీపై పత్వా జారీచేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ ఆదేశంతోనే హత్యయత్నానికి పాల్పడ్డారా అని ప్రశ్నించగా.. సమాధానం ఇవ్వలేదు. అయతొల్లా అంటే తనకు గౌరవం ఉందని చెప్పాడు.
భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ న్యూయార్క్ లోని చౌటౌక్వా ఇనిస్టిట్యూట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనగా ఆగష్టు 12వ తేదీన ఓ దుండగుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు. రష్దీ ప్రసంగిస్తుండగా స్టేజిపైకి వచ్చి 10-15 సార్లు కత్తితో గాయపర్చిన విషయం తెలిసిందే. సల్మాన్ రష్దీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ అనే పుస్తకాన్ని ఇరాన్ లో 1988 నంచి నిషేధించారు. రష్దీని చంపేస్తామంటూ ఎప్పటినుంచో బెదిరింపులు వచ్చాయి. రష్దీని చంపిన వారికి రూ.30 లక్షలకు పైగా డాలర్లు రివార్డు ఇస్తామని బహిరంగ ప్రకటన చేశారు. ఈక్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ ఆదేశాలతోనే ఈదాడి జరిగిందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో నిందితుడు హదీ మాతార్ తన వెనుక ఎవరి ప్రమేయం లేదని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..