Viral News: వదంతులను ట్వీట్ చేసిందన్న కారణంతో మహిళలకు 34 ఏళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు..
Viral News: సోషల్ మీడియా నియంత్రణపై ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలను పాటిస్తున్నాయి. అయితే ఎక్కడా పెద్దగా కఠినమైన చర్యలు కనిపించవు. తప్పుడు పోస్టులు, ఫేక్ న్యూస్, విద్వేశపూరిత ట్వీట్ చేసిన వారిని..
Viral News: సోషల్ మీడియా నియంత్రణపై ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలను పాటిస్తున్నాయి. అయితే ఎక్కడా పెద్దగా కఠినమైన చర్యలు కనిపించవు. తప్పుడు పోస్టులు, ఫేక్ న్యూస్, విద్వేశపూరిత ట్వీట్ చేసిన వారిని మందలించడమో, ఖాతాలను బ్లాక్ చేయడమో చేస్తుంటారు. మహా అయితే జరిమానా విధిస్తుంటారు. అయితే ఓ దేశంలో మాత్రం వందతులను ట్వీట్ చేసిందన్న కారణంతో ఓ మహిళకు ఏకంగా 34 ఏళ్లు జైలు శిక్షను విధించారు. ఈ షాకింగ్ సంఘటన ఎక్కడ జరిగింది.? ఇంతకీ ఆమె చేసిన ఆ ట్వీట్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
సల్మా అల్ షెబాబ్ సౌదీలో మైనారిటీగా ఉన్న షియా మిస్లిం వర్గానికి చెందిన మహిళ. ఇద్దరు పిల్లలున్న ఆమె బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్టూడెంట్. గతేడాది జనవరిలో సెలవుల్లో భాగంగా సౌదీ వచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమె చేసిన కొన్ని ట్వీట్ల ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు ఆమెపై అభియోగాలు ఉన్నాయి. ట్వీట్ల ద్వారా వదంతులను ప్రచారం చేశారన్న కారణంతో ఆమెపై విచారణ చేపట్టారు. తొలుత ఆరేళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పును అల్ షెబాబ్ సవాలు చేయగా.. పైకోర్టు ఆరేళ్ల కారాగారవాసాన్ని కాస్త 34 ఏళ్లుకు ఖరారు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Report I #SaudiArabia: 34 years sentence against the women’s right activist #SalmaAlShehab
? Read here: https://t.co/1S7sMV0gxY pic.twitter.com/ATjTREgxJM
— ESOHR (@ESOHumanRightsE) August 16, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..