Hong Kong Protest:హాంకాంగ్‌లో ఆగని అల్లర్లు… లాయర్లతో సహా 53మంది ప్రముఖులు అరెస్ట్ .. బెయిల్‌పై విడుదల

హాంకాంగ్‌లో అరెస్టైన అమెరికా మానవ హక్కుల న్యాయవాదికి సహా పలువురికి బెయిల్ మంజూరు చేశారు. దేశ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారనే అనుమానంతో సామూహిక అరెస్టుల..

Hong Kong Protest:హాంకాంగ్‌లో ఆగని అల్లర్లు...  లాయర్లతో సహా 53మంది ప్రముఖులు అరెస్ట్ .. బెయిల్‌పై విడుదల
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2021 | 1:43 PM

Hong Kong Protester : హాంకాంగ్‌లో అరెస్టైన అమెరికా మానవ హక్కుల న్యాయవాదికి సహా పలువురికి బెయిల్ మంజూరు చేశారు. దేశ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారనే అనుమానంతో సామూహిక అరెస్టుల చేయడాన్ని న్యాయవాదులు ఖండించారు. గత ఏడాది అనధికారిక ప్రాధమిక ఎన్నికల్లో పాల్గొన్నందుకు జాతీయ భద్రతా చట్టం ప్రకారం 53మంది అరెస్టు చేశారు. వీరిలో న్యాయ సంస్థలో పనిచేస్తున్న జాన్ క్లాన్సీ ఒకరు. ఆయన ప్రభత్వ వికలాంగుల కోసం పనిచేసి సంస్థలో పనిచేస్తారు. నిరుపేద, మైనారిటీ వర్గాల తరపు పోరాడుతున్న తమని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బాధితులు ఖండించారు.

తమ హక్కులను, జాతీయ భద్రతా చట్టాలను చైనాకు మద్దతు తెలిపే అధికారులు దుర్వనియోగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యమకారులు. అసలు బీజింగ్ ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారంటూ అరస్టైనవారు ప్రశ్నించారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.

“జాతీయ భద్రతా చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని.. ప్రజాస్వామ్య విలువలు, భావ వ్యక్తీకరణలు, ప్రజల ఆకాంక్షలను మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హాంకాంగర్స్ . ప్రాథమిక మానవ హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతుందని హాంకాంగ్ యూనిసన్ అనే ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిలిస్ చెయంగ్ ఫంగ్-మెయి అన్నారు.

గత జూలైలో జరిగిన ప్రాధమిక ఎన్నికల్లో పాల్గొన్న 50 మందికి పైగా ప్రతిపక్ష శాసనసభ్యులు, కార్యకర్తలను అధికార జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారనే అనుమానంతో బుధవారం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు న్యాయవాదులున్నారు. ఈ అరెస్టులు ఉద్దేశ్యపూర్వకంగానే జరిగాయని మైనారిటీ వర్గాలకు సహాయం అందించే హాంకాంగ్ యునిసన్ వైస్ చైర్ జెఫ్రీ ఆండ్రూస్ చెప్పారు.

Also Read: ప్రపంచం దేశాల్లో కొనసాగుతున్న కరోనా మృత్యుఘోష… 19 లక్షలు దాటిన మరణాలు