ట్విటర్ బ్యాన్ పై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం, ఇది కుట్ర అని ఆరోపణ, తేల్చుకుంటామని ప్రకటన
ట్విటర్ తనను నిషేధించడంపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇది కుట్ర అని, ఈ సాధనంలోని ఉద్యోగులు డెమొక్రాట్లతోను, రాడికల్ శక్తులతోను కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించాడు.
ట్విటర్ తనను నిషేధించడంపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇది కుట్ర అని, ఈ సాధనంలోని ఉద్యోగులు డెమొక్రాట్లతోను, రాడికల్ శక్తులతోను కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించాడు.మీది ప్రైవేట్ కంపెనీ కావచ్చు.. కానీ ప్రభుత్వం ఇఛ్చిన 250 సెక్షన్ (గిఫ్ట్) పై ఆధారపడి మీరు సాగుతున్నారు అని ట్విటర్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇది ఎంతోకాలం సాగదన్నారు. నేను, నా సహచరులు పోరాటాన్ని కొనసాగిస్తాం, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరిట మీకు అనుకూలురైనవారు ఏది మాట్లాడినా దాన్ని కవర్ చేస్తారని, దానికి ప్రాచుర్యం కల్పిస్తారని ట్రంప్ విమర్శించారు.
కాగా క్యాపిటల్ హిల్ వద్ద జరిగిన హింస, పోలీసు కాల్పులు, బాష్ప వాయు ప్రయోగం, నలుగురు మృతి ఘటనల నేపథ్యంలోనూ, తన మద్దతుదారులను ట్రంప్ రెచ్ఛగొట్టిన వైనం తదితర పరిణామాలతో ట్రంప్ ను ట్విటర్ శాశ్వతంగా నిషేధించింది. హింసను తాము ఎప్పుడూ సమర్థించే ప్రసక్తి లేదని, ఇందుకు కారకులైనవారి వ్యాఖ్యలను తాము డిలీట్ చేస్తున్నామని ప్రకటించింది. ట్రంప్ సహా ఇతర నేతలెవరైనా ఇలా వ్యవహరించినా వారిపై బ్యాన్ వేటు పడుతుందని వార్నింగ్ ఇచ్చింది.
Also Read :జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా.? సీఎంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. Also Read :సీఎం జగన్ ఢిల్లీ యాత్రలపై చంద్రబాబు మండిపాటు.. ఏం సాధించారంటూ ఘాటైన వ్యాఖ్యలు.. సెటైర్లు.