జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా.? సీఎంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగ‌న్‌పై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడిన ఆయన..

  • Ravi Kiran
  • Publish Date - 5:54 pm, Mon, 30 November 20
జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా.? సీఎంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Chandrababu Comments: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగ‌న్‌పై మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడిన ఆయన.. సభలో వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారని.. వరద నష్టంపై గాలి కబుర్లు చెబుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చే బాధ్యతలేని ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ లేనట్టుగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని.. ఇప్పటివరకు దాదాపుగా 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే.. ఫేక్ న్యూస్‌లతో చర్చను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు.

పంట బీమా రైతుల హక్కు అని చెప్పిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతల చేతకానితనం వల్లే రాష్ట్ర రైతాంగం నష్టపోతోందని ఆవేదన చెందారు. ఏడాదిలో రూ. లక్షా 20 వేల కోట్లు అప్పులు చేసారని.. మిగతా నాలుగేళ్లలో ఇంకెన్ని అప్పులు చేస్తారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుతో తనకు తొలిసారి కోపం వచ్చిందన్న చంద్రబాబు.. ఉన్మాదంతో ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.