AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరె ! అచ్ఛ జాక్ మా లా ఉన్నాడే ! ఎవరీయన, ఏం చేస్తున్నాడు ? వైరల్ అవుతున్న వీడియో ! అంతా సస్పెన్స్ !

అలీబాబా 'మాలిక్' జాక్ మా అదృశ్యం వార్త ప్రపంచదేశాల్లో సంచలనం సృష్టిస్తాజోంది. సుమారు రెండు నెలలుగా ఈయన అదృశ్యం మిస్టరీగా ఉంది.

Viral Video: అరె ! అచ్ఛ జాక్ మా లా ఉన్నాడే ! ఎవరీయన, ఏం చేస్తున్నాడు ? వైరల్ అవుతున్న వీడియో ! అంతా సస్పెన్స్ !
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 09, 2021 | 5:46 PM

Share

అలీబాబా ‘మాలిక్’ జాక్ మా అదృశ్యం వార్త ప్రపంచదేశాల్లో సంచలనం సృష్టిస్తాజోంది. సుమారు రెండు నెలలుగా ఈయన అదృశ్యం మిస్టరీగా ఉంది. అయితే ఆయన ఆచూకీ ఎక్కడ ! ఏం చేస్తున్నాడు ? కానీ సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ వీడియోలో  మాత్రం అచ్ఛు ఆయన మాదిరే ఉన్న వ్యక్తి కనబడ్డాడు. ఈ వ్యక్తి ఎయిర్ కండిషనర్ ని రిపేర్ చేస్తున్నాడు. అనుభవజ్ఞుడైన రిపేరర్ లా ఏసీలను మరమ్మతు చేస్తున్నాడు. అసలు ఏమిటీ  వీడియో కథ ? ఇది 2018 నాటి వీడియో.. సేమ్ టు సేమ్ జాక్ మాదిరే ఉన్న ఈ వ్యక్తి తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై భారత్ వర్ష్ శోధించగా ఇది ఫేక్ వీడియో అని తేలింది. పూర్తిగా ఫేక్ అని విశ్వసనీయంగా తెలిసింది. ఇతను జాక్ మా అయితే కాదు.. మొత్తానికి ఏసీ రిపేరర్ అన్న మాట ! కానీ అదే పోలికలతో ఉండడంతో ఈ వ్యక్తి ఆయనే అయి ఉండవచ్ఛు నని చాలామంది  పొరబడుతున్నారు.

చైనీస్ బిలియనీర్ అయిన జాక్ మా అసలు అదృశ్యం కాలేదని, హాంగ్ జౌ లోని తన సొంత కార్యాలయంలో ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఉన్నారని సీ ఎన్ బీసీ వెల్లడించింది. చివరిసారిగా ఈయన గత అక్టోబరులో కనిపించాడు. అసలు ఒక్కసారిగా  అజ్ఞాతంలోకి వెళ్లాడా లేక తీవ్ర అస్వస్థతకు గానీ, కరోనా వైరస్ పాజిటివ్ కి గానీ గురయ్యాడా అన్నది తెలియడంలేదు. దేశ ఆర్థికవిధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న జాక్ మా పై చైనా ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. స్కూలు టీచర్ అయిన ఈ బిలియనీర్ అమెరికాలో బిజినెస్ ట్రిక్స్ నేర్చుకున్నాడు. తన 21 ఏళ్ళ అలీబాబా గ్రూపు కంపెనీల ద్వారా విపరీతంగా పాపులర్ అయ్యాడు.

Also Read:Alibaba Founder Jack Ma: ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా అదృశ్యం… రెండు నెలలుగా కనపడని వైనం… Also Read:Alibaba Founder Jack Ma: రెండు నెలలుగా కనిపించకుండా పోయిన జాక్‌మా ఎక్కడ..? అదృశ్యంపై పలు అనుమానాలు