Alibaba Founder Jack Ma: రెండు నెలలుగా కనిపించకుండా పోయిన జాక్‌మా ఎక్కడ..? అదృశ్యంపై పలు అనుమానాలు

Alibaba Founder Jack Ma: ఆలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా కనిపించకుండా పోవడం కార్పొరేట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అయితే జాక్ మా అదృశ్యం ...

Alibaba Founder Jack Ma: రెండు నెలలుగా కనిపించకుండా పోయిన జాక్‌మా ఎక్కడ..? అదృశ్యంపై పలు అనుమానాలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2021 | 6:53 AM

Alibaba Founder Jack Ma: ఆలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా కనిపించకుండా పోవడం కార్పొరేట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అయితే జాక్ మా అదృశ్యం వెనుక చైనా దేశ ప్రభుత్వ ప్రమేయం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్‌ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా జాక్‌మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది.

వ్యాపారపరంగా గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కడి నుంచి జాక్‌ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మాకు అక్షింతలు వేయడమే కాకుండా జాక్‌ మాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ ఐపీవో (37 బిలియన్‌ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్‌ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది. చైనాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ జాక్‌ను ఆదేశించింది.

కాగా, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన జాక్‌ మా.. రెండు నెలలుగా ఆచూకీ లేదు. చైనాలో అత్యంత సంపన్న వ్యక్తుల్లో రెండో వ్యక్తి. ప్రపంచ వాణిజ్య రంగానికి శాసించగల సత్తా ఉన్న వ్యక్తి జాక్‌మా. అలీబాబా గ్రూప్‌ కంపెనీల అధినేత జాక్‌మా కనిపించకపోవడాన్ని చైనా ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చైనా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన జాక్‌మా.. అక్టోబర్‌ 24న ప్రభుత్వ ఆర్థిక విధానాలు వాణిజ్యానికి అనుగుణంగా లేవన్నారు. బ్యాంకులు తాకట్టు దుకాణాల పద్దతిని వీడాలన్న ఆయన.. న్యూ జనరేషన్‌కు కొత్త వ్యవస్థను తీసుకురావాలన్నారు. జాక్‌మాపై ఫోకస్‌ పెట్టిన చైనా సర్కార్‌.. అలీబాబా గ్రూప్‌ కంపెనీలపై విచారణ జరుపుతోంది. 10 బిలియన్‌ డాలర్ల యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీవోను ప్రభుత్వం అడ్డుకుంది. యాంట్‌ ఐపీఓను రద్దు చేసిన చైనా సర్కార్‌.. ఎక్స్‌క్లూజివ్‌ డీలింగ్‌ అగ్రిమెంట్‌ చేయడం ద్వారా గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేసింది.

చైనా పరిపాలన, మార్కెట్‌ రెగ్యులేషన్‌ అధికారుల విచారణ, అలీబాబా సంస్థపై యాంటీట్రస్ట్‌ ఇన్వెస్టిగేషన్‌ చేసింది చైనా ప్రభుత్వం. ఈ వార్తల నేపథ్యంలో కుప్పకూలిన అలీబాబా సంస్థ షేర్లు చివరి రెండు నెలల్లోనే సుమారు 11 బిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దీని విలువ రూ.80వేల కోట్లకుపైనే) నష్టం వాటిల్లింది. జాక్‌మా స్వయంగా నిర్వహిస్తున్న ప్రముఖ టాలెంట్‌ షో, ఆఫ్రికా బిజినెస్‌ హీరోస్‌ షో ఫైనల్‌లో జడ్జిగా పాల్గొంటానని అక్టోబర్‌లో చెప్పారు. అయితే నవంబర్‌ 14న జరిగిన షోకు హాజరు కానీ జాక్‌మా.. ఆ వెబ్‌ సైట్‌ నుంచి జాక్‌ ఫోటోలు తొలగించబడ్డాయి. అయితే అక్టోబర్‌ నుంచి కనిపించకుండా పోయిన జాక్‌ మా.. చైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జాక్‌మా వ్యక్తిగతం..

జాక్‌మా1964 సెప్టెంబర్‌ 15న హాంగ్జౌలో జన్మించారు. హాంగ్జౌ యూనివర్సిటీలో ఇంగ్లీష్‌లో డిగ్రీ పట్టా పొందారు. యూనివర్సిటీలో టీచర్‌ జంగ్‌ యింగ్‌ని పెళ్లాడిన జాక్‌.. వారికి ఇద్దరు పిల్లలు. ఇంగ్లీష్‌ టీచర్‌గా వృత్తిని ప్రారంభించారు. కేఎఫ్‌సీ సహా దాదాపు 30 కంపెనీలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన జాక్‌ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

వ్యాపారం..

కాగా, జాక్‌మా 1994లో ఒక అనువాద సంస్థను ప్రారంభించారు. 1995 ఏప్రిల్‌లో 1.2 లక్షల పెట్టుబడితో చైనా పేజెస్‌ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మూడేళ్లలో 8 లక్షల అమెరికన్‌ డాలర్ల స్థాయికి చేరుకుని కొత్త టెలికమ్‌ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. అయితే అందులో ఎక్కువ కాలం కొనసాగలేదు. 1998లో బీజింగ్‌ ఈ-కామర్స్‌ వెబ్‌ సైట్‌కు హెడ్‌గా బాధ్యతలు వహించారు. చైనా వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను గుర్తించిన జాక్‌మా.. ఈ-కామర్స్‌లో సొంత కంపెనీని స్థాపించేందుకు నిర్ణయించుకున్నారు. 1999 అక్టోబర్‌లో 18న స్నేహితుల సాయంతో అలీబాబా పేరుతో ఈ-కామర్స్‌ కంపెనీని ప్రారంభించారు. అయితే వారిధిగా ఉన్న అలీబాబా డాట్‌కామ్‌ దుస్తులు, గృహోపకరణాల అమ్మకాలు, కొనుగోళ్ల సంస్థల ఏర్పాటు మూడేళ్లలోనే ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చెందింది. కాగా, అలీబాబా గ్రూప్‌ కంపెనీలు, యాహూతో కలిసి చైనాలో యాహూ వెబ్‌సైట్‌ నిర్వహణ ఈబే తరహా ఆన్‌లైన్‌లో వస్తువుల వేలం నిర్వహించే ‘టావోబవో’ టీమాల్‌ పేరుతో రిటైల్‌ వెబ్‌సైట్‌ చాటింగ్‌ కోసం ‘లైవాంగ్’ ఆప్‌నీ అలీమాయ పేరుతో ఒక ఆన్‌లైన్‌ ప్రకటనల వెబ్‌సైట్లు ప్రారంభించారు.

వివిధ దేశాల్లో స్థానిక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అలీబాబా కంపెనీలో ప్రధానంగా మూడు ముఖ్యమైన సైట్లు ఉన్నాయి. అవి తావోబో, త్మాల్‌, అలీబాబా డాట్‌ కామ్‌. లక్షల మందికి వ్యాపార కేంద్రంగా మారిన ఈ సైట్లు 2012లో ట్రిలియన్‌ యువాన్‌ మార్కును అలీబాబా దాటేసింది. అలాగే జాక్‌మా 2015లో హుపన్‌ బిజినెస్‌ స్కూల్‌ను ప్రారంభించారు. 2016లో జాక్‌మా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో అలీబాబా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ పదవి నుంచి దిగిపోతున్నట్లు జాక్‌మా ప్రకటించారు.

దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే జాక్‌మా 2019 సెప్టెంబర్‌లో కంపెనీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి పూర్తిగా తొలగిపోయారు. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి వచ్చిన ఒత్తిడుల కారణంగానే చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక గ్రూప్‌ సంస్థలకు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్న డేనియేల్‌ జాంగ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. జాక్‌మా ఈ-కామర్స్‌ వృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు.

జాక్‌మా ఫౌండేషన్‌ స్థాపన..

జాక్‌ మా ఫౌండేషన్‌ స్థాపన, సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2008 నుంచే తన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. 2019లో ఆసియా దాతృత్వ హీరోల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. 2020లో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి తనవంతు విరాళం అందించిన జాక్‌మా..2020 డిసెంబర్‌ నాటికి 50.9 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. ఇక చైనా రెండో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు జాక్‌ మా కారణమనే వాదన వినిపిస్తోంది.

Also Read:

Worlds Richest Man: సంపాదంలోనే కాదు దానంలోనూ టాప్ అమెజాన్ సీఈవో.. ఎంతమొత్తంలో దానం చేశారో తెలుసా..

Wealth Records in 2020: గతఏడాదిలో పెరిగిన వీరిద్దరి సంపాదనతో అమెరికాలోని 10కోట్లమందికి సుమారు 2వేల డాలర్ల పంచవచ్చట..

Death Penalty: లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు.. ప్రభుత్వ మాజీ అధికారికి మరణ శిక్ష

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!