Honeybees Vaccine: తేనెటీగలకు వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలిసారిగా.. దీనిని ఎలా ఇస్తారు..?
కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు మనుషులకే కాకుండా జంతువులు, పురుగులు, ఇతర వాటికి కూడా వస్తున్నాయి..
కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు మనుషులకే కాకుండా జంతువులు, పురుగులు, ఇతర వాటికి కూడా వస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే తొలిసారిగా తేనెటీగల కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని అమెరికా ఆమోదం తెలిపింది. అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్ నుంచి తేనెటీగలు మృత్యువాత పడకుండా ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. యూఎస్ డిపార్టహమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌డీఏ) ఈ వ్యాక్సిన్‌కు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసినట్లు వ్యాక్సిన్ తయారీ సంస్థ యలాన్ యానిమల్ హెల్త్ వెల్లడించింది. అయితే మొక్కల్లో పరాగ సంపర్కానికి ఎంతోగానే సహకరించే జీవులుగా పర్యావరణంలో తేనెటీగల పాత్ర కీలకంగా ఉంటుంది. తేనెటీగలను బతికించేందుకు ఈ వ్యాక్సిన్ ప్రముఖ పాత్ర పోషించనుందని డలాన్ యానిమల్ హెల్త్ సీఈవో అన్నెట్ క్లైజర్ తెలిపారు.
ప్రపంచంలోని పంట ఉత్పత్తిలో మూడింట ఒక వంతు తేనెటీగలపై ఆధారపడి ఉంటుంది. అయితే వాటి సంఖ్య వేగంగా తగ్గుతోంది. కొత్త వ్యాక్సిన్ సాయంతో వాటి సంఖ్య తగ్గకుండా అడ్డుకోవడంతో పాటు పంట దిగుబడిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అమెరికా ప్రకారం.. ఈ వ్యాక్సిన్ అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ వ్యాధికి తయారు చేయబడింది. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి సూక్ష్మజీవి బ్యాక్టీరియా పెనిబాసిల్లస్ లార్వా బీస్‌లో వ్యాపిస్తుంది.
ఈ బ్యాక్టీరియా సంక్రమణ పెరిగినప్పుడు కాలనీలోని తేనెటీగలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు అవి చనిపోతుంటాయి. ఈ వ్యాధికి మందు లేదు. ఈ వ్యాధి సోకిన తేనెటీగలను కాల్చివేయడం జరుగుతుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి. తేనెటీగల లార్వాలో మార్పు ఆగిపోతుంది అందుకే తేనెటీగల పెంపకంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ వ్యాధిని సులభంగా గుర్తించగలరు.
వ్యాక్సి్‌న్ ద్వారా రోగనిరోధక శక్తి:
ఈ వ్యాక్సిన్ ద్వారా తేనెటీగల్లో రోగనిరోధకశక్తి పెంచేలా చేస్తుందని అంటున్నారు. దీని వల్ల తేనెటీగలు చనిపోకుండా వ్యాక్సిన్ కాపడుతుందని అన్నారు. అమెరికాలో 2006 నుంచి తేనెటీగలు క్రమంగా తగ్గిపోతున్నాయని యూఎస్‌డీఏ గణాంకాలు చెబుతున్నాయి. అయితే తేనెటీగల గుంపులుగా చనిపోవడానికి కారణమయ్య బ్యాక్టీరియా వ్యాధులు వంటివన్ని వాటి మరణానికి కారణమవుతున్నట్లు యూఎస్‌డీఏ తెలిపింది. దీని వల్ల తేనెటీగలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ వ్యాక్సిన్ వల్ల ఎంతో మేలు జరుగుతుందని యూఎస్‌డీఏ తెలిపింది.
కాగా, అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్ కారణంగా తేనెటీగల పెంపకందారులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంత వరకు ఈ వ్యాధికి చికిత్స లేదు. దీని కారణంగా వీటికి వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్‌కు కారణమయ్యే ఫేనిబాసిల్లస్ లార్వా బ్యాక్టీరియానే వాడుతారపొ డలాన్ యానిమల్ హెల్త్ తెలిపింది.
తేనెటీగలకు వ్యాక్సిన్ ఎలా ఇస్తారు..?
అయితే మనుషులకైతే వ్యాక్సిన్ ఇవ్వడం తెలుసు. కానీ ఈ తేనెటీగలకు వ్యాక్సిన్ ఎలా ఇస్తారనేగా మీ అనుమానం. తేనెతుట్టెలోని శ్రామిక ఈగలు రాణి ఈగకు అంఇంచే ఆహరం రాయల్ జెల్లీలో వ్యాక్సిన్ ద్వారా ఈ బ్యాక్టీరియాను అందిస్తారు. ఆ ఆహారం ద్వారా రాణి ఈగకు అందే రోగనిరోధక బ్యాక్టీరియా దాని అండాశయాలలోకి చేరుతుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ పేర్కొంది. రాణి ఈగ అండాశయాలలోకి వ్యాక్సిన్ చేరడం వల్ల అది లార్వాకు రోగనిరోధక శక్తిని అందిస్తుందని, దీని వల్ల కొత్తగా జన్మించే ఈగలు ఈవ్యాధిని తట్టుకునే శక్తి ఉంటుందని తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ ఈ ఏడాదిలో పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండనుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ డలాన్ వివరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి