AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన కేసులో కీలక మలుపు.. విధుల నుంచి మిశ్రా తొలగింపు..

ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా (34) ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. మిశ్రా గత ఏడాది నవంబర్‌లో...

Air India: తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన కేసులో కీలక మలుపు.. విధుల నుంచి మిశ్రా తొలగింపు..
Shankar Mishra
Ganesh Mudavath
|

Updated on: Jan 07, 2023 | 2:35 PM

Share

ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా (34) ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. మిశ్రా గత ఏడాది నవంబర్‌లో న్యూయార్క్‌ నుంచి న్యూ ఢిల్లీ కి ఎయిరిండియా విమానంలో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం వెల్స్ ఫార్గో ఉద్యోగి మిశ్రాను శుక్రవారం తొలగించారు. ఈ ఆరోపణలను తాము తీవ్రంగా కలవరపడుతున్నట్లు తెలిపింది. నవంబర్ 26, 2022న ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళ చేసిన ఆరోపణలను అనుసరించి, పోలీసులు మిశ్రాపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) జారీ చేశారు. ఢిల్లీ పోలీసులు పైలట్‌తో సహా ఎయిర్‌లైన్‌లోని ఎనిమిది మంది సిబ్బందికి సమన్లు జారీ చేశారు. నిందితులను గుర్తించడానికి బెంగళూరు, ముంబయి, ఢిల్లీలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.

ఎయిరిండియా ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపులు, మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మిశ్రాపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 354 (లైంగిక వేధింపులు), 294 (అశ్లీల చర్య), 509 (కించపరిచేలా పదాలు, సంజ్ఞలు చర్య), 510 (మద్యం సేవించిన వ్యక్తి బహిరంగంగా దుర్వినియోగం చేయడం,సెక్షన్ 23 కింద కేసు నమోదు చేశారు. ముంబైలోని కుర్లాలోని కమ్‌గర్ నగర్‌లోని అతని నివాసానికి బృందాలను పంపినప్పటికీ మిశ్రాను గుర్తించలేదు. అతని నివాసంపై నిఘా ఉంచిన ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో మిశ్రా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి.. శనివారం (ఇవాళ) అరెస్టు చేశారు. అంతేకాకుండా.. మిశ్రా వచ్చే 30 రోజుల పాటు ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించారు.

కాగా.. విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన కలకలం రేపింది. న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వెళుతుండగా మూత్ర విసర్జనకు గురైన బాధితురాలు జరిగిన ఘటనను వివరిస్తూ ఫిర్యాదు చేసింది. మిశ్రా నిల్చొని తన ప్యాంట్‌ని విప్పి తనపై మూత్ర విసర్జన చేసాడంటూ ఫిర్యాదులో వివరించింది. తన దుస్తులు, బూట్లు, బ్యాగ్ మూత్రంలో తడిసిపోయాయని వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..