Accident: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది దుర్మరణం.. 22 మందికి తీవ్ర గాయాలు..
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జియాంగ్జీ ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు.
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జియాంగ్జీ ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో శనివారం అర్ధరాత్రి పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న చైనా పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
నాన్‌చాంగ్ కౌంటీలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులను ఉటంకిస్తూ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV నివేదించింది. ఈ ఘటన అనంతరం నాన్‌చాంగ్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రావిన్స్‌లో దట్టంగా పొగమంచు కమ్ముకోని ఉందని, ఫ్లడ్ లైట్లతో వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ సూచనలు చేశారు. పాదచారులు వెళ్లే మార్గంలో వెళ్లవద్దని.. లేన్‌లను మార్చవద్దని.. వాహనాలను ఓవర్‌టేక్ చేయవద్దంటూ సూచించారు.
కాగా, కఠినమైన భద్రతా నియంత్రణలు లేకపోవడం వల్ల చైనాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారింది. దీంతో అక్కడ తరచూ ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని పేర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..