Robot Lawyer: త్వరలో కోర్టు మెట్లు ఎక్కనున్న రోబో.. మానవులతో పోటీపడి వాదించనున్న వకీల్‌రోబో

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతో అమెరికాకు చెందిన 'డునాట్‌ పే' సంస్థ ఈ వకీల్‌ రోబోలను రూపొందించింది. దీని ద్వారా కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని సదరు సంస్థ వెల్లడించింది.

Robot Lawyer: త్వరలో కోర్టు మెట్లు ఎక్కనున్న రోబో.. మానవులతో పోటీపడి వాదించనున్న వకీల్‌రోబో
Robot Lawyer
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2023 | 3:19 PM

ఆధునికయుగంలో టెక్నాలజీ బాగా పెరిగింది. సాంకేతికతను ఉపయోగించి అనేక పరికరాలను తయారు చేస్తున్నారు. ఇకనుంచి రోబో న్యాయ వాదులు కూడా రాబోతున్నాయి. కోర్టుల్లో మానవ న్యాయవాదులతోపాటు రోబో న్యాయవాదులు కూడా కేసులను వాదించనున్నాయి. త్వరలో రోబో న్యాయవాది తొలిసారి కోర్టులో వాదించనుంది. అయితే ఇది నమ్మశక్యంగా లేకున్నా త్వరలో వాస్తవం రూపం దాల్చనుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతో అమెరికాకు చెందిన ‘డునాట్‌ పే’ సంస్థ ఈ వకీల్‌ రోబోలను రూపొందించింది. దీని ద్వారా కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని సదరు సంస్థ వెల్లడించింది. కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన ఈ రోబో లాయర్‌ ఫిబ్రవరి నెలలో కోర్టులో తొలిసారి వాదించనున్నట్లు తెలిపింది. అయితే ఏ కోర్టులో ఎవరిపై వాదిస్తుంది అన్న వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు. కాగా, ఈ రోబో న్యాయవాది స్మార్ట్‌ఫోన్‌ సహకారంతో పని చేస్తుందని న్యూ సైంటిస్ట్ పేర్కొంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాషువా బ్రౌడర్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ 2015లో కాలిఫోర్నియాలో ‘డునాట్‌పే’ సంస్థను స్థాపించారు. తాము రూపొందించిన ‘డునాట్‌పే’ యాప్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్‌ అని ఆయన తెలిపారు. ఈ రోబో ఎలా పనిచేస్తుందో తెలియజేస్తూ ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ యాప్‌లోని ఒక బటన్‌ నొక్కడం ద్వారా కార్పొరేషన్‌లతో పోరాటం చేయడంతోపాటు బ్యూరోక్రసీని ఓడించవచ్చని, ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జాషువా బ్రౌడర్ తెలిపారు. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని వాస్తవాలను తారుమారు చేస్తున్నవారికి చెక్‌ పెట్టేందుకు మత యాప్‌ ద్వారా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!