Serial Killer: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. ఆ మహిళ ఏంచేసిందో తెలుసా..! వైరల్ అవుతున్న వీడియో..

Serial Killer: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. ఆ మహిళ ఏంచేసిందో తెలుసా..! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 08, 2023 | 4:40 PM

మీరు విమానంలో ప్రయాణిస్తున్నారు అనుకోండి. విదేశాలకు వెళ్తున్న ఆనందంలో ఎన్నెన్నో ఊహలతో మీ ప్రయాణం సాగుతోంది. ఇంతలో ఎందుకో ఒక్కసారి మీ పక్కసీట్‌లోకి చూసినప్పుడు..


మీరు విమానంలో ప్రయాణిస్తున్నారు అనుకోండి. విదేశాలకు వెళ్తున్న ఆనందంలో ఎన్నెన్నో ఊహలతో మీ ప్రయాణం సాగుతోంది. ఇంతలో ఎందుకో ఒక్కసారి మీ పక్కసీట్‌లోకి చూసినప్పుడు.. ఆ వ్యక్తి ఓ సీరియల్‌ కిల్లర్‌ అని తెలిస్తే ఎలాఉంటుంది? సీన్‌ సితారే.. అలాంటి అనుభవమే ఓ మహిళా ప్రయాణికురాలికి కలిగింది. విమానంలో తన పక్కన కూర్చున్న పెద్దాయన్ను ఓ మహిళా ప్రయాణికురాలు కాస్త అనుమానంగా, భయంగా చూస్తున్న ఈ ఫొటో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆమె పరిస్థితిని వర్ణిస్తూ బోలెడు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఎందుకంటారా.. ఆ వ్యక్తి మరెవరో కాదు.. 1970, 1980లలో భారత్‌ సహా వివిధ దేశాల్లో సుమారు 30 హత్యలకు పాల్పడిన సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ శోభరాజ్‌. డబ్బు కోసం విదేశీ పర్యాటకులను ప్రత్యేకించి యువతులనే టార్గెట్‌ చేసి హతమార్చిన కిరాతకుడు. ఇప్పుడు చెప్పండి ఆ మహిళ భయపడ్డంలో ఆశ్చర్యం లేదుకదా. ఓ హత్య కేసులో సుమారు 20 ఏళ్లు నేపాల్‌ సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని.. ఇటీవలే నేపాల్‌ సుప్రీం కోర్టు విడుదల చేసింది. దీంతో స్వదేశమైన ఫ్రాన్స్‌కు దోహా మీదుగా వెళ్లేందుకు ఇలా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కినప్పుడు ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీరు ఆ మహిళ స్థానంలో కూర్చొనే సాహసం చేయగలరా?’ అని ఒకరు ఛాలెంజ్‌ విసిరితే ‘నేను కూడా ఆ మహిళలాగే భయంభయంగా చూస్తుంటా’ అని మరొకరు ఆన్సరిచ్చారు. పండుగ సీజన్‌లో విమాన టికెట్‌ బుక్‌ అయిందన్న ఆనందం చివరకు ఇలా నీరుగారిపోయిందని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.