AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎక్కడినుంచి వస్తారయ్యా బాబు..! 11 లక్షల బైక్ మీద పాల డెలివరీ.. షాకవుతున్న నెటిజన్లు..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు.

Viral Video: ఎక్కడినుంచి వస్తారయ్యా బాబు..! 11 లక్షల బైక్ మీద పాల డెలివరీ.. షాకవుతున్న నెటిజన్లు..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jan 07, 2023 | 8:46 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా.. పాలు అమ్మేందుకు ఓ వ్యక్తి.. అత్యంత ఖరీదైన ప్రీమియం బైక్‌ హార్లే డేవిడ్‌సన్‌ను ఉపయోగించడం నెట్టింట సంచలనంగా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. సాధారణంగా పాలు అమ్మే వ్యక్తులు సైకిల్ లేదా చిన్నపాటి ద్విచక్రవాహనాన్ని ఉపయోగిస్తారు. పాల క్యాన్లు తగిలించుకునేందు వీలుగా వాటిని మార్చి ఇంటింటికీ వచ్చి పాలు పోసి ఇళ్లకు వెళ్తుంటారు. అయితే.. ఈ వ్యక్తి మాత్రం.. రూ.11 లక్షలకు పైగా ఉండే హార్లే డేవిడ్‌సన్‌ బైక్ ను ఉపయోగించడం సంచలనంగా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి హార్లే డేవిడ్‌సన్‌ బైకు వెనక రెండు పాల క్యాన్లు పెట్టుకొని వీధుల్లో చక్కర్లు కొడుతుండటాన్ని చూడవచ్చు. హార్లే డేవిడ్ సన్ బైక్ కు పాల క్యాన్లకు తగిలించుకుని ఇంట్లో నుంచి వచ్చిన వ్యక్తి.. పాలు పోసేందుకు వెళ్తూ కనిపించాడు. ఈ వీడియోను అటుగా వెళ్తున్న వారు ఏవరో తీసి పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అయితే.. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది.. అనేది తెలియలేదు. ఈ వీడియోను అమిత్‌ బదనా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయగా.. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పాలు అమ్మడానికి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై వెళ్లడం.. అదుర్స్ అంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్