Viral Video: ఒకడు మనోడికి ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి మనోడు ఎదురెళ్లినా వాడికే రిస్క్.. బైకర్ దెబ్బకు లారీ ఫసక్..
ప్రమాదాలు ఆహ్వానించబడని అతిథుల్లాంటి. ముఖ్యంగా రోడ్డుపైకి ఒకసారి ఎంటరైతే.. గమ్యం చేరే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

ప్రమాదాలు ఆహ్వానించబడని అతిథుల్లాంటి. ముఖ్యంగా రోడ్డుపైకి ఒకసారి ఎంటరైతే.. గమ్యం చేరే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అయితే, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైక్ నడుపుతున్న యువకుడు వేగంగా వచ్చి.. ట్రక్కుకు అడ్డుపడ్డాడు. అయితే, వాడు లేచిన సమయం బాగుండి.. ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో బయటపడ్డాడు. ఒంటిపై కనీసం గీత కూడా పడకుండా క్షేమంగా ఉన్నాడు. అయితే, ట్రక్కు మాత్రం ఘోరంగా దెబ్బతిన్నది. వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ఉన్న ఈ భీకర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ట్రాఫిక్ సిగ్నల్‌కు అమర్చిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఓ ఐపీఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు.
రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను షాక్‌కు గురి చేసింది. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో, ఒక మోటార్‌సైకిలిస్ట్ కాలనీ రహదారి నుండి నేరుగా ప్రధాన రహదారికి వచ్చాడు. అంతలో అకస్మాత్తుగా ముందు నుంచి అతివేగంగా ట్రక్కు వచ్చింది. వీడియో చూస్తుంటే బైక్‌ను లారీ ఢీకొట్టినట్లు అనిపించినా.. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. బైక్‌ను తిప్పుకుని వెనక్కి వెళ్లిపోయాడు. ఆ ట్రక్కు మాత్రం రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.




వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్కుసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. అందుకే.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కాస్త నెమ్మదిగా వెల్లండి. అటు ఇటూ చూస్తూ ప్రయాణం చేయండి.
ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय, औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD
— Dipanshu Kabra (@ipskabra) January 5, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
