AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Angkor Wat: కరోనా తర్వాత కొత్త హంగులు సంతరించుకున్న ఆంగ్‌కార్ వాట్‌ ఆలయం.. మళ్ళీ మొదలైన భక్తుల సందడి

Angkor Wat: కాంబోడియాలోని (Cambodia) ప్రఖ్యాత ఆంగ్‌కార్ వాట్‌లో సందడి మొదలైంది.. కరోనా వైరస్ (Corona Virus) తర్వాత కొత్త హంగులను సంతరించుకున్న ఈ పురాతన ఆలయాన్ని మళ్లీ..

Angkor Wat: కరోనా తర్వాత కొత్త హంగులు సంతరించుకున్న ఆంగ్‌కార్ వాట్‌ ఆలయం.. మళ్ళీ మొదలైన భక్తుల సందడి
Angkor Wat Temple
Surya Kala
|

Updated on: Apr 23, 2022 | 9:42 AM

Share

Angkor Wat: కాంబోడియాలోని (Cambodia) ప్రఖ్యాత ఆంగ్‌కార్ వాట్‌లో సందడి మొదలైంది.. కరోనా వైరస్ (Corona Virus) తర్వాత కొత్త హంగులను సంతరించుకున్న ఈ పురాతన ఆలయాన్ని మళ్లీ తెరిచారు.. వేకువజామునే పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. 12వ శతాబ్దం నాటి ఈ శిథిల ఆలయాన్ని చూసేందుకు వీరంతా తహతహలాడుతున్నారు. కాంబోడియాలోని సీమ్‌రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ప్రఖ్యాత ఆంగ్‌కార్ వాట్‌ ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా ఇప్పటికే నమోదైంది.. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆంక్షల కారణంగా కాంబోడియా టూరిజం నిలిచిపోయింది..ఇప్పుడు ఆంక్షలు సడలించడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు..

తూర్పు ఆసియాలో ఒకప్పుడు వెలుగొందిన సనాతన హిందూ సంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచింది ఆంగ్‌కార్‌ వాట్‌. ఈ ఆలయంలో విష్ణుమూర్తితో పాటుగా బుద్ద విగ్రహాలు కూడా కనిపిస్తాయి. కాంబోడియా పర్యాటక రంగానికి ఈ ఆలయం ప్రధాన ఆకర్శన.. కరోనా సంక్షోభానికి ముందు ఏటా 7 లక్షల మంది ఆంగ్‌కార్‌ వాట్‌ను చూసేందుకు వచ్చేవారు.. మళ్లీ అదే స్థాయిలో పర్యాటకులు వస్తారని ఆశిస్తోంది అక్కడి ప్రభుత్వం. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన స్థానిక వ్యాపారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఏడాది సమయమైనా పడుతుందని భావిస్తున్నారు.. కంబోడియాకి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి.. ఏడు రోజుల క్వారంటైన్‌ తర్వాత మళ్లీ ర్యాపిడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాతే తమ దేశంలో పర్యటిచడానికి అనుమతి ఇస్తారు కంబోడియా అధికారులు.

మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Diabetes Control: నేరేడు గింజలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చు.. పొడిని ఇలా తయారు చేసుకోండి..

Tirupati: స్వామిలో ఐక్యమైన గోప వనిత రామమ్మ.. ఆమె పేరు మీదుగా గొల్ల మండపం నిర్మాణం..